in

4620 థియేటర్లలో ‘సైరా’

మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా-నరసింహారెడ్డి తెలుగు- హిందీ- తమిళ- మలయాళ- కన్నడ- హిందీ భాషల్లో ఏక కాలంలో విడుదలౌవుతోంది. అక్టోబర్ 2 న సినిమా విడుదల సందర్భంగా అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. అయితే సైరా ఎన్ని థియేటర్లలో రిలీజవుతోందో తెలుసా. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 4620 థియేటర్లలో రిలీజ్ కానుందని తెలుస్తోంది.

ఇరు తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతాల వారీగా థియేటర్ల సంఖ్యను పరిశీలిస్తే.. నైజాం 420.. సీడెడ్ 330.. ఆంధ్ర 450 మేర థియేటర్లను కేటాయించారు. ఓవరాల్ గా ఏపీ తెలంగాణలో 1200 థియేటర్లలో రిలీజవుతోంది. దేశవ్యాప్తంగా ఏ రేంజులో రిలీజ్ చేశారు? అన్నది పరిశీలిస్తే… ఆంధ్రప్రదేశ్ తెలంగాణా కలిపి 1200.. కర్ణాటక 340.. తమిళనాడు 350.. కేరళ 130.. థియేటర్లలో రిలీజువతోంది.

ఉత్తరాది సహా ఓవర్సీస్ కలుపుకుంటే దాదాపు 3600 థియేటర్లలో రిలీజవుతోంది. హైదరాబాద్- చెన్నై-ముంబై- అమెరికా సహా ప్రతిచోటా స్పెషల్ షోలకు తీవ్రమైన డిమాండ్ నెలకొంది. తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు 8 ఏఎం 50 స్పెషల్ షోలకు రెడీ చేశారు. ఇది కూడా కేవలం తెలుగు వెర్షన్ వరకే. ఇప్పటివరకు ఏ తెలుగు సినిమాకు ఇన్ని స్పెషల్ షోలు వేయలేదని తెలుస్తుంది. చూడాలి మరి సైరా సినిమా ఏం రేంజ్ లో ఉందో..

What do you think?

Written by telugucircles

Leave a Reply

Your email address will not be published.

టీవీ9 హౌజ్ నుంచి జాఫర్ అవుట్

బై పోల్‌లో 85 ఏళ్ల బామ్మ