in

బొగ్గు కొరతతోనే విద్యుత్ కోతలు

ఏపీలో విద్యుత్ కోతలు ఉన్న మాట నిజమేనని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. బొగ్గు కొరతతోనే విద్యుత్ కోరత ఏర్పడిందన్నారు. విద్యుత్ సమస్య పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వంతో పాటు పక్క రాష్ట్రాలతో కూడా చర్చలు జరుపుతున్నామని తెలిపారు. విద్యుత్ కొరత గురించి ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చేసిన వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని చెప్పారు.

గ్రామ సచివాలయాల ఆలోచన చంద్రబాబుకు వచ్చినప్పుడు ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. గత ప్రభుత్వ విధానాల వల్లే ఏపీ ఆర్థిక పరిస్థితి కుంటుపడిందన్నారు బొత్స. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఒకటో తేదీనే జీతాలిస్తున్నామని ప్రభుత్వంపై కన్నా విమర్శలు సరికాదన్నారు మంత్రి. 110 మున్సిపాలిటీల్లో త్వరలోనే ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు బొత్స. కొత్త ఇసుక పాలసీ అమల్లోకి వచ్చిన తర్వాత కొరత తగ్గిందని చెప్పారు. ఆసుపత్రుల వద్ద క్యాంటీన్ల ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నామని తెలిపారు.

What do you think?

Written by telugucircles

Leave a Reply

Your email address will not be published.

ఢిల్లీలో హై అలర్ట్‌

ముగిసిన సాహో హడావిడి.. ఫైనల్ కలెక్షన్?