in

కంప్యూటర్ల యుగంలో కళ్లు జాగ్రత్త

సర్వేంద్రియానాం నయనం ప్రధానం… అన్ని అవయవాలు మంచిగా పనిచేస్తూ కంటి చూపు సరిగా లేకపోతే అదొక పెద్ద అడ్డంకి. అందుకే కళ్లు ఉంటేనే ఏదైనా… జీవితంలో ఏదో ఒక సందర్భంలో కళ్లకు ఏదో ఒక సమస్య ఎదురుకావచ్చు. కొన్ని చిన్న సమస్యలైతే, కొన్ని కంటి చూపును దెబ్బతీసేవీ ఉంటాయి. అందుకే వీటి గురించి తగినంత అవగాహన కలిగి ఉంటే కంటి చూపును పరిరక్షించుకోవచ్చు.

ఇప్పుడంతా కంప్యూటర్ల యుగం. కనుక నయనాలపై ఒత్తిడి (స్ట్రెయిన్) ఎక్కువైపోతోంది. ఎక్కువ దూరం పాటు లేదా ఎక్కువ సమయం పాటు డ్రైవింగ్ చేయడం కూడా కంటిపై ఒత్తిడి పెంచుతుంది. ఎందుకంటే, అన్నేసి గంటల పాటు విరామం లేకుండా చూస్తూ ఉండడం వల్ల కళ్లు బాగా అలసిపోతాయి. దాంతో వాటికి విశ్రాంతి అవసరం. కానీ, ఎంత మంది ఇలా విశ్రాంతి ఇస్తున్నారు…? చాలా తక్కువ మందే. ఎక్కువ మంది కళ్లు అలసిపోయినా సరే అదే పనిగా చూస్తూ, పనిచేస్తూనే ఉంటుంటారు. కానీ, కళ్లు అలసిపోయినప్పుడు వాటికి విశ్రాంతినివ్వడం అవసరం. ఈ సమస్య ఎదురైతే వైద్యుడిని సంప్రదించాలి.

కంటి ఉపరితలం అంతా కూడా రక్తనాళాలతో నిండి ఉంటుంది. కళ్లు చిరాకుకు గురైనా లేక ఇన్ఫెక్షన్ బారిన పడినా ఈ రక్త నాళాల పరిమాణం పెరిగిపోతుంది. దాంతో కళ్లు ఎర్రబారినట్టు కనిపిస్తాయి. మరో ముఖ్య కారణం పైన చెప్పుకున్నట్టు కంటిపై ఒత్తిడి వల్ల కూడా కొన్ని సందర్భాల్లో రక్త నాళాల పరిమాణం పెరిగిపోయి కళ్లు ఎర్రబారతాయి. తగినంత నిద్ర లేకపోవడం, అలెర్జీలు, గాయాలకు గురైనా ఇలా జరుగుతుంది. కంజెంక్టివైటిస్ అనే మరో సమస్య వల్ల కూడా కళ్లు ఎర్రగా మారిపోవచ్చు. సూర్యకిరణాల తాకిడికి ఎక్కువగా ఏళ్ల పాటు గురైన వారిలోనూ ఈ సమస్య కనిపిస్తుంది. అందుకే సమస్య ఏంటన్నది నిర్ధారించుకునేందుకు వైద్యుల సాయం తీసుకోవడం మంచిది.

ప్రెస్బియోపియా (హ్రస్వదృష్టి)

దూరం చూపు మంచిగానే ఉన్నా కంటికి దగ్గరగా ఉన్న వాటిని చూడడంలో ఇబ్బంది ఈ సమస్యలో కనిపిస్తుంది. సాధారణంగా 40 సంవత్సరాల వయసులో ఇది రావడం సహజమే. చదివే సమయంలో పుస్తకాన్ని కంటికి కొంచెం దూరంగా ఉంచి చదవడం చేస్తుంటారు. హ్రస్వదృష్టి ఉందనడానికి సంకేతం ఇదే. రీడింగ్ గ్లాసెస్ వాడడం ద్వారా ఇబ్బందిని తొలగించుకోవచ్చు. కాంటాక్టు లెన్స్ లు, లాసిక్ తరహా సర్జరీలతోనూ పరిష్కారం పొందొచ్చు.

కళ్ల వెంట నీరు

కంట్లో నీటి పరిమాణం తగ్గిపోవడం ఒక సమస్య అయితే, పెరిగిపోవడం కూడా సమస్యే. కాంతి, గాలి లేదా ఉష్ణోగ్రత విషయంలో సెన్సిటివ్ గా ఉండే వారిలో అధికంగా నీరు కారడం కనిపిస్తుంది. అందుకే బయటి అంశాల ప్రభావం కంటిపై పడకుండా జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా దీన్ని నివారించుకోవచ్చు.

What do you think?

Written by telugucircles

Leave a Reply

Your email address will not be published.

మోసం చేసింది.. అంజలిపై ఫిర్యాదు

బిజెపిని చాలా ప్రమాదకరంగా భావిస్తున్నాం