in

పోస్టాఫీస్‌ లో డబ్బులు వేస్తే వెయ్యి కి వెయ్యి పది వేలకు పది వేలు

మీరు కచ్చితమైన రాబడిని ఆశిస్తున్నారా..? డిపాజిట్ చేసిన డబ్బుకు రెట్టింపు రావాలనుకుంటున్నారా..? అయితే ఈ అవకాశాన్ని మీ కోసమే. భారత పోస్టాఫీస్‌ రంగం వివిధ రకాల సేవింగ్స్ స్కీమ్స్‌ను అందించే విషయం తెలిసిందే. అందులో పోస్టాఫీస్ కేవీపీ(కిసాన్ వికాస్ పత్ర) స్కీమ్ కూడా ఒక భాగం. అందులో డిపాజిట్ చేయడం వల్ల మీ డబ్బు రెట్టింపు అవుతుంది. అంటే రూ.1,000కి వెయ్యి, రూ.5,000కు రూ.5 వేలు, రూ.10,000కు రూ.10 వేలు, రూ.50,000కు రూ.50 వేలు ఇలా వస్తుంది.

అయితే ఇందులో మరో ట్విస్ట్ ఉందండి. అందులో డిపాజిట్ చేసిన వెంటనే మీ డబ్బు డబుల్ అవ్వదు. ఇందుకు 113 నెలల సమయం పడుతుంది. అంటే మీరు కేవీపీలో ఇన్వెస్ట్ చేసిన తరువాత 9 ఏళ్ల 5 నెలలు వేచి ఉండాలి.

కాగా ప్రస్తుతం కేవీపీ డిపాజిట్లపై 7.6శాతం వడ్డీ లభిస్తోంది.

ఇక కిసాన్ వికాస్ పత్రాలను బ్యాంక్ లేదా పోస్టాఫీస్‌కు వెళ్లీ కేవీపీ పత్రాలను కొనొచ్చు. నగదు, చెక్, పే ఆర్డర్, డిమాండ్ డ్రాఫ్ట్ (డీడీ) ద్వారా కొనుగోలు చేయవచ్చు. 2.5 ఏళ్ల తర్వాత డబ్బులు అవసరమైతే వీటిని విక్రయించొచ్చు. ఒకవేళ కేవీపీ సర్టిఫికెట్ హోల్డర్ మరణిస్తే అప్పుడు కూడా డబ్బులు వెనక్కు వస్తాయి. అంతేకాదు కేవీపీ సర్టిఫికెట్లను ఒక వ్యక్తి పేరు నుంచి మరో వ్యక్తి పేరుకు మార్చుకోవచ్చు. ఒకవేళ కేవీపీ పత్రం కనిపించకుండాపోతే డూప్లికేట్ కేవీపీ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. సింగిల్ హోల్డర్ సర్టిఫికెట్, జాయింట్ ఏ టైప్ సర్టిఫికెట్, జాయింట్ బి టైప్ సర్టిఫికెట్ అనే మూడు రకాల కేవీపీలు ఉంటాయి.

What do you think?

Leave a Reply

Your email address will not be published.

GIPHY App Key not set. Please check settings

వైరల్ వీడియో: సర్కస్‌ లో ఎదురు తిరిగిన ఎలుగుబంటి

బుల్ బుల్ బాలయ్యను చల్ చల్ అంటూ గెంటేశారు