in

బ్రేకింగ్: తహశీల్దార్ విజయపై పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ లో దారుణం జరిగింది. తహశీల్దార్ ఆఫీస్ లోకి దూరిన అగంతకుడు.. తహశీల్దార్ విజయపై పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు. తీవ్రంగా గాయపడిన విజయ స్పాట్ లోనే చనిపోయారు. ఆమెను కాపాడే ప్రయత్నం చేసిన ఆఫీస్ లోని ఇద్దరు సిబ్బందికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నరు. తహశీల్దార్ ఆఫీస్ లోనే ఈ ఘాతుకం జరిగింది.

తహశీల్దార్ సజీవ దహనం ఘటన కలకలం రేపింది. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్త చేపట్టారు. ఆ వ్యక్తి ఎవరు, ఎందుకు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు అనే వివరాలు సేకరించే పనిలో ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు పోలీసులు.

అబ్దుల్లాపూర్ మెట్ లోని తహశీల్దార్ ఆఫీస్ లో విజయ తహశీల్దార్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఎప్పటిలాగే సోమవారం(నవంబర్ 4,2019) ఉదయం విజయ ఆఫీస్ కి వచ్చారు. తన సీటులో కూర్చుని ఉన్నారు. మధ్యాహ్నం 1.30గంటల ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తి ఆఫీస్ లోకి వచ్చాడు. తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ ను ఒక్కసారిగా ఆమెపై పోసి నిప్పంటించాడు. మంటలు చెలరేగడంతో విజయ కేకలు వేసుకుంటూ బయటకు వచ్చారు. మంటలు శరీరం మొత్తం వ్యాపించాయి. తీవ్రంగా గాయపడిన విజయ.. కారిడార్ లో కుప్పకూలారు. కాసేపటికే చనిపోయారు. తహశీల్దార్ ఆఫీస్ రోడ్డుపైనే ఉంటుంది. ఈ ఘటన ఆఫీస్ సిబ్బందిని, స్థానికులను షాక్ కు గురి చేసింది. తహశీల్దార్ తో మాట్లాడాలి అంటూ లోనికి వచ్చిన వ్యక్తి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భోజన విరామం సమయంలో ఈ ఘటన జరిగింది. తహశీల్దార్ ని కలవాలని ఓ వ్యక్తి వచ్చాడు. అటెండర్ అతడిని కాసేపు ఆపాడు. తహశీల్దార్ విజయ లోనికి పంపాలని చెప్పడంతో అటెండర్ ఆ వ్యక్తిని లోనికి పంపాడు. ఆ వ్యక్తి తహశీల్దార్ విజయతో అరగంట సేపు మాట్లాడాడు. అరగంట సేపు మాట్లాడుకున్నాక.. లోపలి నుంచి ఒక్కసారిగా అరుపులు వినబడ్డాయి. పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు. మంటలు చెలరేగడంతో విజయ బయటకు పరుగులు తీశాడు. ఆమెని కాపాడేందుకు ఆఫీస్ లోని ఇద్దరు సిబ్బంది తీవ్రంగా ప్రయత్నించారు. ఈ ప్రయత్నంలో వారికి తీవ్ర గాయాలు అయ్యాయి. శరీరం మొత్తం మంటలు వ్యాపించడంతో విజయ స్పాట్ లోనే చనిపోయారు” అని పోలీసులు వెల్లడించారు.

కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాఫ్తు చేపట్టారు. ఇది తెలిసిన వ్యక్తి పనేనా లేక పాత కక్షల నేపథ్యంలో ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటాడా. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం పాస్ బుక్కులు పంపిణీ చేసింది. దీనికి సంబంధించి గొడవలు ఏమైనా జరిగాయ. లేక భూతగాదాలు కారణమా. అసలు తహశీల్దార్ ని సజీవ దహనం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది… ఇలా అన్ని కోణాల్లోనూ పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు

తహసీల్దారుపై కిరోసిన్ పోసి తగలబెట్టిన వీడియో

What do you think?

Leave a Reply

Your email address will not be published.

GIPHY App Key not set. Please check settings

పవన్ పింక్ రీమేక్ లో పూనమ్ కౌర్?

తహసీల్దారుపై కిరోసిన్ పోసి తగలబెట్టిన వీడియో