in

ఏపీలో ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంపు

ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీసీ బస్సు ఛార్జీలను ఏపీఎస్‌ఆర్టీసీ పెంచింది. పెంచిన బస్సు ఛార్జీలు బుధవారం(డిసెంబర్ 11) ఉదయం నుంచి అమల్లోకి రానున్నాయి. పల్లె వెలుగు బస్సులో కిలోమీటర్‌కు రూ. 10 పైసలు పెంచారు. ఎక్స్‌ప్రెస్‌, అల్ట్రా డీలక్స్‌, సూపర్‌ లగ్జరీల్లో కిలోమీటర్‌కు రూ. 20 పైసలు, ఇంద్ర, ఏసీ, గరుడ, అమరావతి బస్సుల్లో కిలోమీటర్‌కు రూ. 10 పైసలు పెంచారు.

వెన్నెల, స్లీపర్‌ బస్సుల్లో ఛార్జీల పెంపు లేదు. సిటీ, ఆర్డినరీ బస్సుల్లో 11 స్టేజీల వరకు ఛార్జీల పెంపు లేదు. పల్లె వెలుగులో మొదటి 2 స్టేజీలు/10 కిలోమీటర్ల వరకు ఛార్జీల పెంపు లేదు. తదుపరి 75 కిలోమీటర్ల వరకు రూ. 5 ఛార్జీ పెంచినట్లు ఏపీఎస్‌ఆర్టీసీ ప్రకటించింది.
అయితే సిటీ బస్సులకు సంబంధించి 11 స్టేజీల వరకు ఛార్జీల పెంపు లేదని ఆర్టీసీ యాజమాన్యం ఓ ప్రకటనలో తెలిపింది. డీజిల్‌ ధర గత నాలుగేళ్లలో లీటర్‌ ఒక్కింటికి రూ.49 నుంచి రూ.70కి చేరిందని వెల్లడించింది. డీజిల్‌ ధర పెంపు కారణంగా సంస్థకు ఏటా రూ.630 కోట్ల నష్టం వస్తోందని వివరించింది. బస్సుల విడిభాగాలు, సిబ్బంది జీతాలు, ఇతర అలవెన్సుల కారణంగా మరో రూ.650 కోట్ల మేర భారం పడుతోందని తెలిపింది.

What do you think?

Written by telugucircles

Leave a Reply

Your email address will not be published.

ఎన్ కౌంటర్ పై టీఆర్ఎస్ ఎమ్మెల్యే విమర్శలు

మోదీ ట్వీట్.. రికార్డ్