in

ఓట్స్ తో పకోడీ ..ఈజీగా బరువు తగ్గండి

ఓట్స్ గొప్ప ఔషధం. ఓట్స్‌లో ఉండే పోషక విలువల గురించి చెప్పక్కర్లేదు. లావు తగ్గాలంటే ఓట్స్‌ తినమని అందరు చెప్తారు. ఓట్స్‌లో ఉండే బెట-గ్లూకాన్ శరీరంలో పేరుకుపోయిన చెడు కొవ్వుని కరిగించి, రక్తంలో చేరకుండా చేస్తుంది. ఒక పిరికెడు ఓట్స్‌ కొవ్వుని కరిగించేందుకు, ఇటు జీర్ణశక్తికి మెరుగుపరిచేందుకు సాయపడుతుందని నిపుణులు చెప్తున్నా మాట

మరి ఇన్ని పోషక విలువలున్న ఓట్స్‌ని ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఆరోగ్యకరంగా ఉండటానికి తీసుకునే చాలా ఆహారం మనకు టేస్టీగా అనిపించకపోవచ్చు. టేస్టీగా ఉండేలా ఆహారం తయారుచేసుకోవడమే ఇక్కడ చిట్కా. మరి ఓట్స్ తో పకోడీ ఎలా చేసుకొని తినాలో నేర్చుకోండి

ఓట్స్ పకోడి తయారీ కావాల్సినవి

ఓట్స్ : ఒక కప్పు
బియ్యం పిండి : ఒక టేబుల్‌స్పూన్
శనగపిండి : 1 1/2 టీస్పూన్స్
పచ్చిమిర్చి : 2
కరివేపాకు : 2 రెమ్మలు
కొత్తిమీర : చిన్న కట్ట
ఉల్లిగడ్డ : 1
పెరుగు : 2 టేబుల్‌స్పూన్స్,
నూనె, ఉప్పు : తగినంత

ఓట్స్ పకోడి తయారీ

స్టెప్ 1 : ఒక గిన్నెలో ఓట్స్, బియ్యం పిండి, శనగపిండి, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర వేయాలి.

స్టెప్ 2: ఇందులోనే ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేయాలి. కొద్దిగా నూనెని వేడి చేసి ఇందులో పోయాలి

స్టెప్ 3 : దీంట్లోనే పెరుగు, కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. కడాయిలో నూనె వేసి బాగా వేడి చేయాలి

స్టెప్ 4 : ఈ నూనె కాగిన తర్వాత ఓట్స్ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా వేసి బాగా వేయించాలి. వేడి వేడిగా లాగిస్తే ఇవి మరింత టేస్టీగా ఉంటాయి.

What do you think?

Leave a Reply

Your email address will not be published.

GIPHY App Key not set. Please check settings

Alla Nani & Mekathoti Sucharitha Press Meet LIVE – TV9

Violence against health workers carries imprisonment from 6 months to 7 years, says govt – TV9