తెలంగాణ: ముగ్గురు పోలీసులకు కరోనా

తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకు చాలా దారుణంగా పెరుగుతున్నటువంటి మహమ్మారి కరోన వైరస్ కారణంగా ప్రజలందరూ కూడా భయాందోళనకు గురవుతున్న తరుణంలో, అధికారులందరూ కూడా అప్రమత్తమవుతూ, తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే ఈ కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు పోలీసులు తమ నిద్రాహారాలుమాని చాలా కఠినంగా విధులు నిర్వర్తిస్తున్నారు. కాగా కరోనా నివారణకై విధులు నిర్వర్తిస్తున్న పోలీసులు కూడా ఒక్కొక్కరుగా మహమ్మారి కరోనా భారిన పడుతుండడంతో పోలీసు శాఖ లో కూడా భయాందోళనలు మొదలవుతున్నాయని సమాచారం.Ad

కాగా నగరంలో ఒక సీఐ గత 3 రోజులుగా తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతుండటం వలన, ఆయనకీ కరోనా నిర్దారణ అయ్యిందని సమాచారం. దీంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే ఆయనని గాంధీ ఆసుపత్రికి తరలించి ప్రత్యేకమైన ఐసోలేషన్ వార్డుల్లో చికిత్స అందిస్తున్నారు. అయితే బీహార్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ వలస కార్మికులను సొంత రాష్ట్రానికి పంపడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఈ క్రమంలోనే ఆయనకు వైరస్ సోకిందని అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా సీఐకి కరోనా సోకిందన్న విషయం తెలుసుకున్న మిగతా పోలీసులు కూడా కరోనా నిర్దారిత పరీక్షలు జరిపించుకోవడంతో ఎస్సై, కానిస్టేబుల్‌కు కూడా కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. కాగా వారందరిని కూడా గాంధీ ఆసుపత్రికి తరలించామని అధికారులు వెల్లడించారు.