బ్రేకింగ్: గోదావరిఖని సింగరేణి ఓపెన్ కాస్ట్ లో భారీ పేలుడు, నలుగురు మృతి
Timeline

బ్రేకింగ్: గోదావరిఖని సింగరేణి ఓపెన్ కాస్ట్ లో భారీ పేలుడు, నలుగురు మృతి

పెద్దపల్లి జిల్లా రామగుండంలోని సింగరేణి గనుల్లో విషాదం చోటు చేసుకుంది. సింగరేణి ఓపెన్ కాస్ట్-1 లో భారీ పేలుడు సంభవించింది. ఫేజ్-2 లో బ్లాస్టింగ్ చేస్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాదంలో నలుగురు క్రాంటాక్టు కార్మికులు మృతి చెందారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలు కావడంతో వారిని ఆసుపత్రికి తరలించారు.

మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో ఇద్దరు గోదావరిఖని(రాకేష్, ప్రవీణ్‌), ఒకరు కమాన్ పూర్‌(రాజేష్), మరొకరు రత్నాపూర్‌కు చెందినవారుగా గుర్తించారు.

Leave a Reply

Your email address will not be published.