Breaking News :

4YrsForWarriorGonaGannaReddy : ఆపదలో ఆదుకున్న అర్జునుడు

గతంలో ఏబీఎన్ రాధాకృష్ణ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గుణశేఖర్ చెప్పిన విషయం

ఆర్కే : జూనియర్‌ ఎన్టీయార్‌తో ‘రామాయణం’ తీశారు. అతను హీరో అయ్యాక ఎందుకు సినిమా ప్లాన్‌ చేయలేదు?
గుణశేఖర్‌ : ‘ఒక్కడు’ తర్వాత జూనియర్‌ ఎన్టీయార్‌తో సినిమా చేద్దామనుకున్నా. ఆ సమయంలో ‘రుద్రమదేవి’ చిత్రంలో ప్రత్యేక పాత్ర గోన గన్నారెడ్డి గురించి చెప్పాను. ఆయన ఆ పాత్రపై అమితాసక్తి చూపారు. ‘ఈ క్యారెక్టర్‌ను డెవలప్‌ చేసి హీరోగా చేస్తే తప్పకుండా నటిస్తాను’ అన్నారు. నాకు అలా ఇష్టం లేదన్నాను. ‘అర్జున్‌’ మూవీ తర్వాత కూడా జూనియర్‌ ఎన్టీయార్‌తో సినిమా చేద్దామనుకున్నా. సబ్జెక్టు కుదరలేదు.

సినిమా ప్రాబ్లం లో ఉందని తెలుసుకొని తనంతట తానే గుణ శేఖర్ కి ఫోన్ చేసి మరి ఆ పాత్ర నేను చేస్తాను అని చెప్పాడట అల్లు అర్జున్. రెమ్యూనరేషన్ గురించి గుణశేఖర్ ప్రస్తావించినపుడు డబ్బుల గురించి మీరు ఆలోచించొద్దు అని చెప్పాడట బన్నీ.

ఆ ఒక్క పాత్ర సినిమాను ఎక్కడికో తీసుకెళ్ళింది. బన్నీ కెరీర్ లోనే గుర్తుండిపోయే పాత్ర అది.

Read Previous

T.S.R.T.C ఇప్పుడు K.C.R.T.C

Read Next

@peacefulllsoul : అందుకే రావణ దహనం