15 సంవత్సరాల్లో 684 శాస్త్రవేత్తల మృతి

36

అమీర్‌పేటలోని డీకే రోడ్డులో ఎస్ సురేశ్ కుమార్ (56) అనే శాస్త్రవేత్తను గుర్తు తెలియని వ్యక్తులు అత్యంత కిరాతకంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఆయన బాలానగర్‌లోని ప్రతిష్టాత్మక సంస్థ ఎన్‌ఆర్‌ఎస్‌సీ (నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్)లో శాస్త్రవేత్తగా పని చేస్తున్నారు. సురేశ్ కుమార్ నివాసం ఉంటున్న అన్నపూర్ణ అపార్ట్‌మెంట్‌లోని ఆయన ఫ్లాట్‌లో హత్యకు గురైనట్లు పోలీసులు మంగళవారం (అక్టోబర్ 1) గుర్తించారు. తలపై ఇనుప కడ్డీతో బలంగా మోదడంతో ఆయన మృతి చెందినట్లు భావిస్తున్నారు.

తమిళనాడుకు చెందిన సురేశ్‌ కుమార్‌.. కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్‌ఆర్‌ఎన్‌సీలో శాస్త్రవేత్తగా పనిచేస్తూ గత 20 ఏళ్లుగా హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సురేశ్ కుమార్ భార్య ఇందిర ఇండియన్ బ్యాంక్‌లో ఉన్నత ఉద్యోగం చేస్తున్నారు. గతంలో అమీర్‌పేట శాఖలో మేనేజర్‌గా పనిచేసిన ఆమె 2005లో చెన్నైకి బదిలీ కావడంతో అక్కడికి వెళ్లిపోయారు. 14 ఏళ్ల నుంచి సురేశ్ కుమార్ ఒక్కరే అమీర్‌పేటలో నివాసం ఉంటున్నారు. సోమవారం సాయంత్రం విధులు ముగించుకుని ఇంటికి వచ్చిన సురేశ్‌ కుమార్‌ తన గదిలోకి వెళ్లి తిరిగి బయటకు రాలేదు. మంగళవారం ఆఫీస్‌కు రాకపోవడంతో తోటి ఉద్యోగులు ఆయనకు ఫోన్‌ చేశారు. ఎంతకూ ఫోన్‌ లిఫ్ట్‌ చేయకపోవడం, ఆ తర్వాత కాసేపటికి స్విచ్ఛాఫ్ రావడంతో చెన్నైలోని ఆయన భార్యకు సమాచారం అందించారు.

హత్య జరిగి 48 గంటలు గడుస్తున్నా ఎలాంటి ఆధారాలు దొరక్కపోవడం కలవరపరుస్తోంది. కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎస్‌ఆర్ నగర్ పోలీసులు.. దర్యాప్తునకు 3 బృందాలను నియమించారు. పలు కోణాల్లో విచారణ సాగిస్తున్నారు. సురేశ్ కుమార్ కాల్ డేటాను పరిశీలించారు. కేసులో ఇప్పటికే పలువురిని విచారించారు. సైంటిస్టు సురేశ్ కుమార్ నివాసం ఉంటున్న అన్నపూర్ణ అపార్ట్‌మెంట్ వాచ్‌మన్ పోలీసులకు కొన్ని కీలక వివరాలు వెల్లడించాడు. సురేశ్ కుమార్ నివాసానికి తరచూ ఓ యువకుడు వచ్చేవాడని, అతడి పేరు శ్రీనివాస్‌గా చెప్పాడని.. వాచ్‌మన్ తెలిపాడు. శ్రీనివాస్ ఎవరు? సురేశ్ కుమార్‌కు ఎలా పరిచయం? హత్యలో అతడి ప్రమేయం ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ సాగిస్తున్నారు.

15 సంవత్సరాల్లో 684 శాస్త్రవేత్తల మృతిచెందడం పట్ల సైంటిస్టులు ఆందోళనకు గురవుతున్నారు. అసలేం ఏం జరుగుతుంది, దీని వెనక ఎవరు ఉన్నారు. ప్రభుత్వాలు ఏజెన్సీలు ఏం చేస్తున్నాయ్? ఇన్వెస్టిగేషన్ లో అస్సలు ఏం జరుగుతుంది ? ఇప్పటివరకు జరిగిన హత్యల గురించి ఎవరికీ తెలియకుండా ఎందుకు దాస్తున్నారు ? ఈ హత్యలను సూసైడ్ గా, న్యాచురల్ డెత్ గా ఎందుకు చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం దొరకాల్సివుంది. ఇప్పటికే సోషల్ మీడియాలో పలువురు ఆందోళన వ్యక్తం చేశారు.