తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 730 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య, ఆరోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది.
వీటిలో జీహెచ్‌ఎంసీ పరిధిలో 659, ఇతర జిల్లాల్లో 71 కేసులు వచ్చినట్లు పేర్కొంది. దీంతో తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 7,802కి చేరింది. ఇప్పటివరకు కరోనాతో 210 మంది ప్రాణాలు విడిచారు.
ADVERTISEMENT
కరోనా నుంచి కోలుకుని 3,731 మంది డిశ్చార్జి కాగా.. 3,861 మంది చికిత్స పొందుతున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఇవాళ 3,297 శాంపిల్స్‌ను పరీక్షించినట్లు ప్రభుత్వం పేర్కొంది. ఇప్పటి వరకు 57,054 నమూనాలను పరీక్షించగా.. 49,252 నెగిటివ్ వచ్చాయని వెల్లడించింది.
ADVERTISEMENT
