మీడియా : ఇస్రో పరువు తీసిన ఆంధ్రజ్యోతి, వివరణ పేరుతో మళ్ళీ అవమానం
Timeline

మీడియా : ఇస్రో పరువు తీసిన ఆంధ్రజ్యోతి, వివరణ పేరుతో మళ్ళీ అవమానం

చంద్రయాన్ 2 విక్రమ్ ల్యాండర్ సరిగ్గా చంద్రుని దగ్గరి వరకు చేరుకుంది కానీ సరైన కక్షలో ల్యాండ్ అవ్వలేకపోయిందనే విషయం మనకు తెలిసిందే. అయితే ఈ వార్తను అత్యుత్సాహం ప్రదర్శించి ఏబీఎన్ ఆంధ్ర జ్యోతి ఇస్రో ని హేళన చేసే విధంగా హెడ్లైన్ పెట్టి వార్తను ప్రచురించింది.

దీనిపై సోషల్ మీడియా లో రచ్చ జరిగింది. రాధా కృష్ణ ను , ఆంద్రజ్యోతిని ట్రోల్ చేస్తూ నెటిజన్లు కామెంట్లు పెట్టారు. అయితే దీనికి వివరణ ఇస్తూ ఆంధ్రజ్యోతి ఒక చిన్న పోస్టు ని ప్రచురించింది. అది చదివితే మీకు మొదట నవ్వొస్తుంది. ఆ తరువాత కోపం కూడా వస్తుంది.

అందులో ఒకటి గమనించారా. “విక్రమ్ బోల్తా ” అని రాయడానికి కారణం , ఇస్రో శాస్త్రవేత్త “ఒకరు ” ( పేరు లేదు ), విక్రమ్ ల్యాండర్ నిర్దేశిత ల్యాండింగ్ ప్రదేశానికి అరా కిలోమీటరు దూరం లో ” అప్ సైడ్ డౌన్ ” గా పడి ఉన్నట్లు, ఆంద్రజ్యోతికి వివరించారట. ఇది కేవలం ఆంధ్రజ్యోతికి మాత్రమే ప్రత్యేకంగా సమాచారం ఇచ్చారట.

ఇంత విడ్డూరమైన వివరణ ఎవరూ ఇవ్వరు కావొచ్చు ప్రపంచంలో. ఇలా చేసిన తప్పుకి క్షమాపణ చెప్పాల్సింది పోయి, మళ్ళీ ఇస్రో శాస్త్రవేత్తపై ఆ నెపాన్ని నెట్టేయడం ఎందుకు. మళ్ళీ ఇస్రో ని అవమానించడం ఎందుకు? ఇదే ఇంగ్లీష్ లో రాసి ఉంటె, సోషల్ మీడియా లో ఏ రేంజులో ట్రోల్ అయ్యేది పత్రిక. అసలు దేశం మీద గౌరవం ఉన్నవాళ్లెవరైనా ఇలా చర్యలు సమర్థిస్తారా?

అత్యుత్సాహంతో అలాంటి హెడ్ లైన్స్ పెట్టినప్పుడు, దానికి ప్రజలు కోరుకునేది క్షమాపణ. అది చెప్తే సరిపోయేది. ఇప్పటికైనా ఆంధ్రజ్యోతి కళ్ళు తెరిచి ఇస్రో కి, ఇస్రో శాస్త్రవేత్తలకు క్షమాపణలు చెప్పాలి అని ” తెలుగు సర్కిల్స్ ” కోరుతుంది.

Leave a Reply

Your email address will not be published.