Breaking News :

జీవీఎల్ పై ఏబీఎన్ అసత్య కథనాలు.. చంద్రబాబు & కో కోల్డ్ వార్

బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ పై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆగ్రహం అంటూ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కథనాన్ని ప్రచురించింది. జీవీఎల్ పై పలువురు రాష్ట్ర నేతలు మడ్డకి కంప్లైంట్ చేసారని అందుకే నడ్డా ఈ విషయాన్ని సీరియస్గా తీసుకొని ఆయనకు వార్నింగ్ ఇచ్చారట. రాష్ట్ర పార్టీ నిర్ణయాలకు విరుద్ధంగా మీడియాలో మాట్లాడుతూ ఇబ్బందికర పరిస్థితులు ఏర్పరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారని, అంతేకాకుండా ఆంధ్రలోని అధికార పార్టీకి అనుకూలంగా మాట్లాడుతున్నారని నడ్డా దృష్టికి కొందరు తీసుకెళ్లినట్లు సమాచారం అని కథనం సారాంశం. అయితే ఏపీ విషయంలో ఎందుకు పదే పదే మాట్లాడుతున్నారని జీవీఎల్ పై మండిపడ్డారట. రాష్ట్ర నేతలకు సమాచారం ఇవ్వకుండానే గవర్నర్ ని ఎందుకు కలిసారని ప్రశ్నించారట నడ్డా.

అయితే ఈ కథనం పై జీవీఎల్ తరుపున ఆంధ్ర బీజేపీ ట్విట్టర్ అకౌంట్ స్పందించింది. చాల ఘాటుగానే ఏబీఎన్ కి బుద్ధి పెట్టింది.

ABN ఛానల్ అసత్య కథనాలపై BJP ఖండన బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యులు @GVLNRAO గారిపై పూర్తిగా అసత్యాలతో కూడిన కథనం ప్రసారం చేసిన @abntelugutv ఛానల్ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాము..

బీజేపీ జాతీయ అధ్యక్షులు నడ్డా గారు జీవిఎల్ నరసింహారావు గారిపై ఆగ్రహం వ్యక్తం చేశారని అవాస్తవ కథనం పై కచ్చితంగా ABN క్షమాపణ చెప్పాలి అని తెలియచేస్తున్నాము.

పత్రికా, మీడియా విలువలు మరచి తరచూ బీజేపీ పై అసత్య కథనాలు ప్రసారం చేస్తూ రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న ABN ఆంధ్ర జ్యోతి తమ వైఖరిని మార్చుకోకపోతే ఛానల్ చర్చలను భహిష్కరిస్తూ చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలియచేస్తున్నాము.

అయితే ఇపుడు జీవీఎల్ పై ఇలాంటి కథనాలు ఈ టైములో ప్రచురించటం వెనక సుజనా చౌదరి ఉన్నారనేది రాజకీయ వర్గాల్లో ఉన్న మాట. సుజనా చౌదరి ప్రెస్ మీట్ పెట్టి అమరావతి పై మాట్లాడినదానికి పార్టీ తరుపున జీవీఎల్ కౌంటర్ ఇచ్చారు.

చంద్రబాబుకి . అయన అనుచరులు అయిన సుజనా కి ఏబీఎన్ ఛానల్ ఇలా భజన చేస్తూ వారిని విమర్శించే వారిపై అసత్య కథనాలు ప్రచురించటం కొత్తేమి కాదు. కానీ జీవీఎల్ జోలికొస్తే మాత్రం మామూలోడు కాదు అనేది బీజేపీ వర్గాల్లో ఉన్న మాట. చూడాలి ఈ కోల్డ్ వార్ ఏ లెవెల్ కి వెళ్తుందో. ఇది కనుక ఇంకా ఎక్కువైతే నష్టపోయేది , ట్రబుల్స్ లో పాడేది మాత్రం చంద్రబాబు & కో అంటున్నారు.

Read Previous

చిరు కోపానికి కారణం నాగబాబు వీడియోనేనా?

Read Next

అంచనాలకు తగ్గట్టుగా నిశ్శబ్దం ట్రైలర్