బ్రేకింగ్ : రామగుండం సింగరేణి బొగ్గు గనిలో ప్రమాదం
Timeline

బ్రేకింగ్ : రామగుండం సింగరేణి బొగ్గు గనిలో ప్రమాదం

సింగరేణి బొగ్గు గనిలో ప్రమాదం చోటుచేసుకుంది. రామగుండం డివిజన్ పరిధిలోని వకీల్‌పల్లి భూగర్భ బొగ్గు గనిలో జంక్షన్ కూలిపోవడంతో ఈ ప్రమాదం సంభవించింది. గురువారం సాయంత్రం 66 లెవెల్‌లో 41 డీప్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు కార్మికులు గల్లంతు అయ్యారు.

సమాచారం అందుకున్న సింగరేణి యాజమాన్యం సహాయక చర్యలు చేపట్టింది. అయితే స్థానిక అధికారుల ద్వారా ప్రమాదం నుంచి ముగ్గురు కార్మికులు తప్పించుకున్నట్లు తెలుస్తోంది.

దీనిపై మరింత సమాచారం రావాల్సి ఉంది.