Breaking News :

సాక్షి టీవీ, సాక్షి పేపర్ మాత్రమే వుండేలా చట్టం చేయండి

వైసీపీ నేత, ఎంపీ విజయసాయి రెడ్డి గురువారం తప్పుడు వార్తలు రాసినందుకు గానూ ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలపై లోక్ సభ స్పీకర్ కు మరియు సభా హక్కుల కమిటీకి ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే జరిగిన విషయాన్నీ వివరిస్తూ విజయసాయిరెడ్డి గారు ఇలా అన్నారు. అఖిల పక్ష సమావేశంలో తనకు క్లాస్ తీసుకున్నారని దురుద్దేశ పూర్వకంగా కథనాలు రాసిన రిపోర్టర్ లపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు.

అయితే జర్నలిజానికి కొన్ని ఎథిక్స్ ఉంటాయి, వాటి ప్రకారం కనీసం తనని సంప్రదించకుండానే ఇష్టం వచ్చినట్లు కథనాన్ని ప్రచురించానన్నారు. అయితే పరువు ప్రతిష్టలకు భంగం కలిగే విధంగా తప్పుడు సమాచారం ప్రచురించినందుకు సదరు పత్రిక రిపోర్టర్ లపై కఠిన చర్యలు టీయూకోవాలని కోరినట్లు తెలిపారు. అయితే రిపోర్టర్ లకి సంబందించిన పార్లమెంట్ ఎంట్రీ పాసులు రద్దు చేయాలనీ కోరినట్లు విజయసాయిరెడ్డి గారు తెలిపారు.

అయితే ఇటువంటి కథనాలు ప్రచురించడం వల్ల ఎంపీగా తనకే కాకుండా పార్లమెంట్ వ్యవస్థని అవమానపరిచారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. జగన్ మోహన్ రెడ్డి మీడియాపై తీసుకుంటున్న నిర్ణయాలు ఇప్పటీకే చాల వ్యతిరేకతని ఎదుర్కొంటుంది. అయితే తాజాగా ఈ ఘటన ద్వారా మరొకసారి టీడీపీ నేతలు ఇలా స్పందించడం జరుగుతుంది. ‘ఈ గోలాంతా ఎందుకు మన సాక్షి టీవీ, సాక్షి పేపరు మాత్రమే వుండేలా చట్టం చేయమంటే పోలా’ అంటూ టీడీపీ ఎంపీ కేశినేని నాని ట్వీట్ చేశారు.

Read Previous

10న బ్యాంకు ఉద్యోగుల ధర్నా

Read Next

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లా