కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ హఠాన్మరణం చెందారు. జీమ్ లో వర్కౌట్ చేస్తున్న ఆయనకు సడెన్ గా హార్ట్ ఎటాక్ వచ్చింది. దీంతో.. కుటుంబ సభ్యులు పునీత్ రాజ్ కుమార్ ని బెంగుళూరులోని విక్రమ్ ఆసుపత్రికి తరలించారు. అయితే.. ట్రీట్మెంట్ అందిస్తున్న సమయంలో పునీత్ ఆరోగ్య పరిస్థితి విషమించటంతో ఆయన తుది శ్వాస విడిచారు.
కన్నడ చిత్ర పరిశ్రమలో పవర్ స్టార్ గా పేరు పొందిన పునీత్ తన నటనతో కన్నడలో ఎనలేని అభిమానులను సంపాదించుకున్నాడు. పునీత్ రాజ్ కుమార్ మరణ వార్త తెలుసుకున్న అభిమానులు ఆస్పత్రి వద్దకి భారీగా చేరుకుంటున్నారు. కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి సైతం పునీత్ రాజ్ కుమార్ కుటుంబ సభ్యలను పరామర్శించారు. ఇప్పటికే కర్ణాటక ప్రభుత్వం స్కూల్స్, థియేటర్స్ అన్నీ మూసేయాల్సిందిగా కోరింది.