నటుడు రాజశేఖర్ కన్నుమూత

ప్రముఖ తమిళ ఫిల్మ్ డైరెక్టర్, నటుడు రాజశేఖర్(62) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని రామచంద్ర హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతూ తుదిశ్వాస విడిచారు. రాజశేఖర్ మరణంతో తమిళ సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.

రాజశేఖర్ దర్శకుడిగా తమిళ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ‘పలైవనచోలై’ ‘చిన్నపూవే మెల్ల పెసు’ తదితర చిత్రాలకు దర్శకత్వం వహించారు. చెన్నై ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ విద్యార్థి అయిన రాజశేఖర్ తొలిసారి నటుడిగా నిగల్‌గల్ (1980) చిత్రంలో నటించారు. దీనికి భారతీరాజా దర్శకత్వం వహించారు. ఆ తర్వాత సినిమాటోగ్రాఫర్‌ రాబర్ట్‌ సహచర్యంతో దర్శకుడిగా మారారు. ‘ఒరు తాలై రాగం’, ‘మనసుక్కుల్ మతప్పు’ వంటి చిత్రాలు ఈ కాంబినేషన్‌కు మంచి పేరు తెచ్చాయి.