ఆర్థిక ఇబ్బందుల్లో పావలా శ్యామల.. తినడానికి కూడా..!
Timeline

ఆర్థిక ఇబ్బందుల్లో పావలా శ్యామల.. తినడానికి కూడా..!

టాలీవుడ్ ఆర్టిస్ట్ పావలా శ్యామల ఆర్థిక పరిస్థితి ప్రస్తుతం దారుణంగా ఉంది. ఒకవైపు కూతురి అనారోగ్యం, మరోవైపు ఆర్థిక సమస్యలతో పావలా శ్యామల తీవ్ర ఇబ్బందుల్లో ఉంది. దాదాపు 250 చిత్రాల్లో నటించి ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్న ఆమె.. ఆర్థిక కారణాల వల్ల అవార్డులు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంటి అద్దె కూడా కట్టలేని పరిస్థితుల్లో ఆమె ఉన్నారు. గతంలో తెలంగాణ ప్రభుత్వం తరపున ఆమెకు నెలకు 10వేల రూపాయల పెన్షన్ వచ్చేలా సహాయం అందించారు. అయితే ప్రస్తుతం ఆ పెన్షన్ కూడా సరిగ్గా రావడం లేదని ఆమె ఆవేదన చెందారు. శ్యామల ఆర్థిక పరిస్థితి తెలుసుకున్న ఆర్టిస్ట్‌ కరాటే కల్యాణి తన వంతు సాయాన్ని అందించారు. అలాగే మా అసోసియేషన్‌ ద్వారా కూడా సహాయం అందేలా ప్రయత్నం చేస్తానని అన్నారు.

Leave a Reply

Your email address will not be published.