లిప్ కిస్ టేస్ట్ బాగుందట
Timeline

లిప్ కిస్ టేస్ట్ బాగుందట

ఏ విషయమైనా సరే చాలా బోల్డ్ గా మాట్లాడే తేజస్వి బిగ్ బాస్ తో మరింత మంది ప్రేక్షకులకు దగ్గరయింది. చేసిన సినిమాలు తక్కువైనా, సినిమాల వాళ్ళ తనకు వచ్చిన పేరు కొంచమే అయినా ఎప్పుడూ ఏదో ఒక విషయంపై బోల్డ్ గా స్పందిస్తూ వార్తల్లో ఉంటుంది ఈ అమ్మాయి.

తాను నటించిన లేటెస్ట్ ఓటిటి సిరీస్ లో లిప్ లాక్ సీన్ లో నటించిందట. ఇంతకూ ముందు కూడా ఒకసారి అలాంటి సీన్ లో నటించినా అది ఫేక్ అని, కానీ ఈ సరి రియల్ గా టేస్ట్ చేశాను అను చెప్తుంది ఈ ముద్దు గుమ్మ. దానికి కారణం హీరో తన ఫ్రెండ్ అవ్వడం వల్లే లిప్ కిస్ సీన్ బాగా ఎంజాయ్ చేశానని చెప్తోంది.

తెరపై ఫస్ట్ టైమ్ నిజంగా లిప్ కిస్సు పెడుతున్నాం కాబట్టి.. ఆ ముద్దు ఎవరికో ఇచ్చే కంటే ఫ్రెండ్ కు ఇస్తే బెటరని భావించిందంట తేజస్వి. అందుకే ఏరికోరి తన ఫ్రెండ్ నే హీరోగా తెచ్చుకుందట. అలా సిల్వర్ స్క్రీన్ పై తొలి లిప్ కిస్ పెట్టానంటోంది.ఒకప్పుడు ముద్దుసీన్ అంటే మొహమాటం ఉండేదని, ఇప్పుడు అవన్నీ దాటుకొని వచ్చానని, ఎంతో మెచ్యూర్ అయ్యానని చెబుతోంది. క్యారెక్టర్ కోసం అవసరమైతే బికినీ కూడా వేసుకుంటానని అంటోంది. అందం ఉన్నప్పుడు చూపించుకోవాలని, ఓ 10 ఏళ్ల తర్వాత ఎలాగూ ఇంత మంచి బాడీ ఉండదని చెబుతోంది తేజస్వి మడివాడ.

Leave a Reply

Your email address will not be published.