బ్రేకింగ్ : రిలీజ్ కన్నా ముందే లీకైపోయిన సూర్య సినిమా ఆకాశం నీ హద్దురా

త‌మిళ స్టార్ హీరో సూర్య హీరోగా న‌టిస్తున్న తాజా చిత్రం `ఆకాశ‌మే నీ హ‌ద్దురా`. సుధా కొండ‌గ‌ర ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. అప‌ర్ణ బాల‌ముర‌ళి హీరోయిన్‌గా న‌టించింది. క‌లెక్ష‌ర్‌కింగ్ మోహ‌న్‌బాబు, బాలీవుడ్ న‌టుడు ప‌రేష్ రావ‌ల్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన ఈ చిత్రాన్ని 2డీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై హీరో సూర్య నిర్మించారు.

ఏయిర్ డెక్క‌న్ వ్య‌వ‌స్థాప‌కులు జి.ఆర్ గోపీనాథ్ జీవిత క‌థ ఆధారంగా ఏయిర్ ఇండియా నేప‌థ్యంలో ఈ మూవీని రూపొందించారు. లాక్‌డౌన్ కార‌ణంగా సినిమాల‌న్నీ ఓటీటీలో రిలీజ్‌కు సిద్ధ‌మ‌వుతుండ‌టంతో సూర్య కూడా త‌న చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ఈ చేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఇందు కోసం ఆమెజాన్ ప్రైమ్‌తో భారీ ఒప్పందం కుదుర్చుకున్నారు కూడా. ఈ చిత్రాన్ని తెలుగు, త‌మిళ భాష‌ల్లో అమెజాన్ ప్రైమ్‌లో రేపు రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించేసారు.

అయితే రిలీజ్ కావడానికి కొన్ని గంటల ముందే ఈ సినిమా ఒరిజినల్ వెర్షన్ పైరసీ రూపంలో పైరసీ వెబ్ సైట్స్ లోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ యూకే సర్వర్ లో ఈ సినిమా అప్లోడ్ చేసిన కొద్దీ నిమిషాలకే పైరసీ దొంగలు ఈ సినిమాని కాఫీ చేసి వారి వెబ్ సైట్స్ లో పెట్టేసారు.

కొసమెరుపు :

ఓటిటి సంస్థలు పైరసీ విషయాన్నీ సీరియస్ గా తీసుకోకపోతే వారి బిజినెస్ కి చాలా కష్టం. ఎందుకంటె సినిమా వారి ప్లాట్ ఫార్మ్స్ లో రిలీజ్ చేసిన గంట వ్యవధిలోనే వాటిని రికార్డ్ చేసి కేలీన్ ప్రింట్ ఫ్రీ గా చూడటానికి పెట్టేస్తున్నారు. అలా ఫ్రీ గా చూసే అవకాశం ఉన్నపుడు వినియోగదారులు వేలకు వేలు పెట్టి సబ్ స్క్రిప్షన్ ఎందుకు తీసుకుంటారు అనేది ఇపుడు అందరి ముందున్న ప్రశ్న .