పూరి జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరి హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ‘రొమాంటిక్’. పూరీ కనెక్ట్స్ పతాకంపై పూరీ జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు అనిల్ పాదూరి దర్శకత్వం వహించారు. కేతిక శర్మ హీరోయిన్గా నటించింది. ఈ చిత్రానికి సునీల్ కశ్యప్ సంగీతం అందించారు. ఇక సీనియర్ నటి రమ్యక్రిష్ణ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించింది. ఈ సినిమా ప్రొమోషన్స్ గ్రాండ్ గా నిర్వహించడంతో పాటుగా ప్రీమియర్ షోకి స్టార్ సెలెబ్రిటీలందరు రావడంతో ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. నేడు ఈ చిత్రం థియేటర్లోకి వచ్చింది. మరి ఈ చిత్ర సమీక్షను ఓ సారి చూద్దాం.
కథ:
పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన రమ్య గోవారికర్ (రమ్యకృష్ణ) పాయింట్ ఆఫ్ వ్యూతో సినిమా స్టార్ట్ అవుతుంది. గోవా నుంచి ప్రారంభమైన ఈ కథలో వాస్కోడగామా (ఆకాశ్ పూరీ) స్మగ్లర్. ఓ రౌడీ గ్యాంగ్‌లో చేరిన తర్వాత వాస్కోడగామా బాగానే డెవలప్ అవుతాడు. ఈ క్రమంలోనే వాస్కోడగామాకు ఓ ఉన్నాధికారి పోలీస్ కూతురు మౌనిక (కేతిక శర్మ) పరిచయమవుతుంది.
అలా పరిచయమైన వీరి మధ్య ప్రేమ కథ ఏంటి? నిజానికి అది ప్రేమనేనా? వాస్కోడగామా చేసిన తప్పుల నుంచి ఎలా బయటపడతాడు.. వాస్కోడగామా, మౌనిక చివరికి కలుస్తారా అనే విషయాలు తెలియాలంటే సిల్వర్ స్క్రీన్‌పై సినిమా చూడాల్సిందే.
మెప్పించిన ఆకాష్ పూరి:
ఆకాశ్ పూరి యాక్టింగ్ బాగా ఇంప్రూవ్ చేసుకున్నాడు. గత సినిమాలతో పోలిస్తే ఆకాష్ నటన పరంగా చాలా పరిణితి చెందాడు. కథ మొత్తం ఆయనే చుట్టూనే తిరగడంతో ప్రతి ప్రేమ్ లో మెరిశాడు. ఇకపోతే హీరోయిన్ కేతిక శర్మకు ఇది మొదటి సినిమానే అయినప్పటికీ చాలా బాగా చేసింది. రమ్యకృష్ణ పోలీసు ఆఫీసర్ రోల్లో ఇరగదీయ్యడమే కాకుండా ఆమె పర్ఫార్మెన్స్ హైలైట్‌గా నిలిచింది. దేవియానిశర్మ, ఉత్తేజ్, సునైనా, మకరంద్ దేశ్ పాండే చాలా బాగా సపోర్టింగ్ రోల్స్ లో ఆకట్టుకున్నారు.
సమీక్షా:
సినిమా చూస్తున్నంత సేపు పూరి జగన్నాథ్ గత సినిమాలు గుర్తుకువస్తాయి. ఆయన రాసుకున్న సంభాషణలు పూరి మ్యూజింగ్స్ లోను విన్నట్టుగానే అనిపిస్తోంది. ఇక హార్ట్ ఎటాక్, 143 సినిమా ఛాయలే గుర్తుకు తెచ్చినట్లు ఉందని ప్రేక్షకులు ఫీల్ అవుతున్నారు. డైరెక్టర్ అనిల్‌కు ఇది మొదటి సినిమా అయినప్పటికీ చాలా ఎక్స్‌పీరియెన్స్ ఉన్న డైరెక్టర్ లాగా సబ్జెక్ట్‌ను డీల్ చేశాడంతో పాటుగా, యూత్ ఎంగేజింగ్ గా తీశాడంతో యూత్ ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు. సునీల్ కశ్యప్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. రొమాంటిక్ సన్నివేశాలు చిత్రీకరించిన విధానం కూడా చాలా బాగున్నాయి.
ప్లస్ పాయింట్స్:
ఆకాశ్ పూరి, కేతిక శర్మ కెమిస్ట్రీ
పూరీ మార్క్, ఎలివేషన్స్
రొమాన్స్ లో వేరే లెవిల్
మైనస్ పాయింట్స్:
గత సినిమాలను గుర్తుచేయటం
లాజిక్కులు లేని మ్యాజిక్కులు
బాటమ్ లైన్: కుర్రకారే.. శ్రీరామరక్ష
రేటింగ్: 2.5/5