‘అల వైకుంఠపురంలో..’ సినిమా స్టోరీ ఏంటంటే… జయరాం అండ్ మురళీశర్మ అనే క్యారెక్టర్ల నుంచి కథ మొదలవుతుంది. ఈ ఇద్దరూ పూర్తి భిన్నమైన సామాజిక,ఆర్థిక వర్గాలకు చెందిన వారు. జయరాం కోటీశ్వరుడయితే, మురళీశర్మ కార్ డ్రైవర్. కానీ ఈ ఇద్దరూ మంచి స్నేహితులు. జయరాం, టబూల సంతానం అల్లు అర్జున్, అలాగే మురళీ శర్మ కొడుకు సుశాంత్. ఈ ఇద్దరూ ఒకేసారి పుడతారట. ఆ సమయంలో స్నేహితుల మధ్య పిల్లల పెంపకం గురించి ఒక డిస్కషన్ వస్తుంది.
ఆ పిల్లలు పెరిగి పెద్దయ్యాక డ్రైవర్ కొడుకు డ్రైవర్‌గా, అలాగే కోటీశ్చరుడి కొడుకు కోటీశ్వరుడిగానే అవుతారు అని మురళీశర్మ వాదిస్తాడు. కానీ జయరాం, ఆ పిల్లల పెంపకాన్ని బట్టి వారి ఫేట్ డిసైడవుతుందని అంటాడు. వారిలో కష్టపడే మనస్తత్వం, ఆలోచించే విధానం, జీవితంలో పైకి రావాలన్న తపనలే వారిని ముందుకు నడిపిస్తాయని అతని వాదన. వాదోపవాదాలు పెరిగి ఆ ఇద్దరూ పిల్లలను మార్చుకునే దాకా వస్తుంది. ఈ విషయం మరెవరికీ తెలియకూడదనే షరతులతో అగ్రిమెంట్ కూడా చేసుకుంటారు.

అలా కోటీశ్వరుడిగా సుశాంత్, డ్రైవర్ కొడుకుగా అల్లు అర్జున్ పెరుగుతారట. పెద్దైన తర్వాత అసలు విషయం తెలిసిపోయిన తర్వాత కూడా సుశాంత్ తను డ్రైవర్ కొడుకుగా వెళ్ళిపోవడానికి ఒప్పుకోడు. ఇదే ట్విస్ట్. ఈ పాత్రల మధ్యలోకి విలన్ నవదీప్ కూడా ప్రవేశిస్తాడు. ఇలా సాగే ఈ కథ మొత్తం “వైకుంఠపురం” అని పేరున్న జయరాం ఇంటిలో జరుగుతుందట.
