బిగ్ బాస్ లీక్స్ : ఎలిమినేట్ అయిపోయిన అలీ రెజా

కింగ్ నాగార్జున స్పెయిన్ పర్యటన ముగించుకుని బిగ్ బాస్‌లోకి వచ్చేశారు. క్రిందటి వారం నాగ్ ప్లేస్‌లో నటి రమ్యకృష్ణ హోస్ట్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. నాగ్ బర్త్‌డే గిఫ్ట్‌గా ఆరోవారం ఎలిమినేషన్స్ తీసేశారు. అటు వైల్డ్ కార్డు ఎంట్రీగా యాంకర్ శిల్ప చక్రవర్తి ఎంట్రీ ఇచ్చింది.

నటి హేమ, జాఫర్, తమన్నా సింహాద్రి, రోహిణి, అషురెడ్డి ఇలా ఐదు వారాలు ఐదుగురు కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆరోవారం కూడా ఒకరు బయటికి వస్తారని అందరూ ఊహించుకుంటే.. అనూహ్యంగా ఆ వారం ఎలిమినేషన్ ప్రాసెస్ ఎత్తేశారు. ఇక యధావిధిగా ఈ వారం ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ పేరు అప్పుడే నెట్టింట్లో హల్చల్ చేస్తోంది.

ఫస్ట్ టైం ఎలిమినేషన్ నామినేషన్‌లోకి వచ్చిన అలీ రెజా.. ఫస్ట్ నామినేషన్‌లోనే ఇంటి నుంచి బయటికి వచ్చేసినట్లు తెలుస్తోంది. హౌస్‌లో ది బెస్ట్ కంటెస్టెంట్ అని పేరున్న అలీకి టెంపర్, అగ్రెసివ్‌నెస్ ఎక్కువ. ఇక ఈ కారణాల వల్లే అలీ రెజాకు ఓట్లు తక్కువగా పడినట్లు తెలుస్తోంది.

Image result for ali reza