స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తమిళంలోకి ఎంట్రీ ఇచ్చేందుకు 2017 లోనే ఏర్పాట్లు జరిగాయి. నిర్మాత జ్ఞానవేల్ రాజా లింగుస్వామి దర్శకుడిగా ఒక ద్విభాషా చిత్రాన్ని అనౌన్స్ చేశారు. కానీ ఇప్పటి వరకు ఆ ప్రాజెక్ట్ పై అప్డేట్ ఏదీ రాలేదు.
బన్నీ కి ఇటు తెలుగులోనూ, అటు మలయాళంలోనూ మంచి క్రేజ్ ఉంది. మలయాళంలో ఉన్న స్టార్ హీరోల కంటే మనోడికి క్రేజ్ ఎక్కువే. ఎప్పటి నుండో మలయాళంలో డైరెక్ట్ గా సినిమా చేస్తాను అని అక్కడి ఫ్యాన్స్ కి మాటిస్తు వస్తున్నాడు.
ఇక తమిళనాడు విషయానికి వస్తే టాలీవుడ్ సినిమాలు బాగా చూస్తారు తమిళనాడు లో. ఇక్కడి సినిమాలు అక్కడ డబ్ అవ్వడం దానికి కారణం. అయితే తెలుగు 2 తమిళ్ డబ్బింగ్ బిజినెస్ బాగా వర్క్ అవుట్ అయ్యే అతి కొద్దీ హీరోలలో బన్నీ టాప్ లో ఉంటాడు. అందుకే చాల మంది ప్రొడ్యూసర్లు బన్నీ ని డైరెక్టుగా తమిళ్ సినిమాల్లో నటించమని ఆఫర్లు కూడా ఇచ్చారు. నిర్మాతలు ఆఫర్లు ఇవ్వడం బన్నీ కి కొత్హేమీ కాదు , అంతగా ఆశ్చర్యపడేంత విషయం కూడా కాదు ఎందుకంటె బన్నీ నటించాలి అనుకుంటే ఏ భాషలో అయినా సరే ఎంత ఖర్చైనా సరే వెనుకాడకుండా ప్రాజెక్ట్ సెట్ చేసే తండ్రి ఉన్నాడు కాబట్టి. అయిపోతే అదే ఇప్పుడు జరగబోతుంది అని టాక్.
తాజాగా ఫిలిం సర్కిల్స్ విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న ఎక్స్ క్లూజివ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం బన్నీ తమిళ్ ప్రాజెక్ట్ ఖరారైందట. గౌతమ్ మీనన్ మాజీ సహాయ దర్శకుడు ఈ సినిమాని తెరకెక్కించబోతున్నట్టు వినికిడి. ఈ సినిమాని గీత ఆర్ట్స్ బ్యానర్లోనే అల్లు అరవింద్ నిర్మిస్తారని తెలుస్తుంది.
ఇక సినిమా వివరాల్లోకి వెళితే ఇదొక స్పోర్ట్స్ డ్రామా అని , ఇందులో అల్లు అర్జున్ తో పాటు శ్రీ విష్ణు కూడా ఉన్నట్టు సమాచారం. బన్నీ శ్రీ విష్ణు ఇంతకుముందే సన్ అఫ్ సత్యమూర్తితో నటించారు. అంతే కాకుండా ఇద్దరు మంచి మిత్రులు కూడా.
ఈ సినిమా కథ నచ్చడం వల్లే బన్నీ కథకి ఒకే చెప్పడమే కాకుండా తమిళ్ లో తన మొదటి ప్రాజెక్టుగా ఎంచుకున్నాడని, వేరే నిర్మాతలైతే ఏదైనా ప్రాబ్లమ్ రావొచ్చని ముందే తండ్రి అయితే బాగుంటుంది ఈ నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తుంది.
ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కితే ఇదే బన్నీ మొదటి తమిళ్ ప్రాజెక్ట్ అవుతుంది.