అల వైకుంఠపురంలో | అల్లు అర్జున్ కి ఫిదా అయిపోయిన తమిళ సినీ ప్రేక్షకులు
Timeline

అల వైకుంఠపురంలో | అల్లు అర్జున్ కి ఫిదా అయిపోయిన తమిళ సినీ ప్రేక్షకులు

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజ హెగ్డే జంటగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అలవైకుంఠపురంలో సినిమా ఈ ఏడాది బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టింది. అయితే నిత్యం ఏదో ఒక విషయంలో రికార్డులు సెట్ చేస్తూనే వస్తున్న ఈ సినిమా తాజాగా తన ఖాతాలో మరో రికార్డును నమోదు చేసుకుంది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ప్లిక్స్‌లో దక్షిణాదిలో అత్యధికంగా చూసిన సినిమాల్లో టాప్-10 చిత్రాలను ఆ సంస్థ ప్రకటించింది. అయితే ఈ జాబితాలో అల వైకుంఠపురంలో సినిమా తొలిస్థానంలో నిలిచింది. ఈ సినిమా తర్వాతి స్థానాల్లో దుల్కర్ సల్మాన్ నటించిన తమిళ చిత్రం కన్నం కన్నం కొల్లయ్యదితల్, అన్నాబెన్ నటించిన మలయాళ చిత్రం కప్పెలా, సత్యదేవ్ నటించిన ఉమామహేశ్వర ఉగ్రరూపస్య నిలిచాయి.

Image

అంతే కాదు ఈ రోజు ఈ సినిమా తమిళ్ టీవీ ఛానల్ సన్ టీవీ లో కూడా టెలికాస్ట్ చేసారు. టీవిలో ఈ సినిమా చూసిన తమిళ ప్రజలు అల్లు అర్జున్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు సోషల్ మీడియాలో. ట్విట్టర్ లో ఇప్పుడు ఇదే ట్రెండింగ్ టాపిక్. అల్లు అర్జున్ నటన ఎంతో బాగుందని, తమిళ్ దుబ్బింగ్ కూడా బాగా సెట్ అయిందని, త్రివిక్రమ్ డైలాగ్స్ అదిరిపోయాయి అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. తమిళ సినిమా స్క్రీన్ స్పేస్ లో ఇకు మంచి భవిష్యత్తు ఉందంటూ ట్వీట్లు పెడుతున్నారు తమిళ సినిమా బిజినెస్ ట్రాకర్లు. మొత్తానికి ఇక్కడే కాదు అక్కడ కూడా బ్లాక్ బస్టర్ కొట్టేసాడు బన్నీ. ఈ ట్రెండ్ చూసి ఖుషీలో ఉన్నారు బన్నీ అభిమానులు.

Leave a Reply

Your email address will not be published.