బిజ్ బ్రేకింగ్: రిలయన్స్ పై అమెజాన్ కన్ను, కొంత వాటా కొనుగోలు చేయనుందట

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ యొక్క రిటైల్ విభాగంలో 9.9% వాటాను కొనుగోలు చేయడానికి అమెజాన్ .కామ్ ఇంక్ చర్చలు జరుపుతున్నట్లు ET NOW గురువారం ఒక కథనాన్ని ప్రచురించింది.

రిలయన్స్ కొత్తగా లాంచ్ చేసిన రిటైల్ బిజినెస్ అయిన జియో మార్ట్ లో వట కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు ET NOW ట్వీట్స్ ద్వారా తెలుస్తుంది

ఇప్పటికే గూగుల్, ఫేస్ బుక్ లాంటి ప్రపంచంలోనే అతి పెద్ద కంపెనీలు రిలయన్స్ లో పెట్టుబడులు పెట్టాయి. ఇక మైక్రోసాఫ్ట్, అమెజాన్ తదుపరి లిస్టులో ఉన్నాయంటూ ఈ మధ్య వార్తలు కూడా షికారు చేసాయి ఇంతలోనే అమెజాన్ రిలయన్స్ లో వట కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉందంటూ వార్తలు వస్తున్నాయి.

జియో మార్ట్ ఈ సంవత్సరం మే నెలలో ప్రారంభం అయింది. ఇది ఫ్లిప్ కార్ట్ మరియు అమెజాన్ కు గట్టి పోటీగా మొదలైంది.

దీనిపై ఇంకా రిలయన్స్ కానీ అమెజాన్ కానీ ఎటువంటి అధికారిక ప్రకటన ఇప్పటివరకు చేయలేదు