అమెరికా ఎన్నికల ముందు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కి ఊహించని ఆటంకం వచ్చిపడింది. డొనాల్డ్ ట్రంప్, ఆయన భార్య మెలానియాలకు కరోనా వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. తన సలహా బృందంలో ఒకరికి కరోనా వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ట్రంప్ దంపతులు కోవిడ్ పరీక్షలు చేయించుకున్నారు. దీంతో ఇద్దరికీ వైరస్ సోకినట్టు తేలింది. ట్రంప్ సలహాదారిణి హూప్ హిక్స్ కోవిడ్ బారినపడ్డ విషయం తెలిసిందే. అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం జరిగిన చర్చా కార్యక్రమంలో పాల్గొనేందుకు ట్రంప్‌తో కలిసి హూప్ హిక్స్ ఎయిర్‌ఫోర్స్ వన్ విమానంలో ప్రయాణించారు.

ఆమెతో సన్నిహితంగా మెలగడంతో ట్రంప్ కూడా వైరస్ బారినపడ్డారు. దీంతో ట్రంప్, మెలానియాలు క్వారంటైన్‌లోకి వెళ్లారు. ఎన్నికలు దగ్గరపడ్డ వేళ ఇది ట్రంప్‌కి ఓ రకంగా గడ్డుపరిస్థితే. కీలకమైన చివరి వారాల్లో ప్రచారానికి ఆయన దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఎదురయ్యింది.

https://twitter.com/realDonaldTrump/status/1311892190680014849?s=20