వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును ప్రారంభించిన అమిత్ షా

13

కేంద్ర మంత్రి అమిత్ షా ఈ రోజు వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును ప్రారంభించారు. ఢిల్లీ రైల్వే స్టేషన్ నుంచి రైల్వే మంత్రి పియూష్ గోయల్, మరో కేంద్ర మంత్రి హర్షవర్షన్ లతో కలిసి అమిష్ షా జెండా ఊపి రైలును ప్రారంభించారు. ఈ సందర్భంగా అమిషా మాట్లాడుతూ జమ్మూ కశ్మీర్ ప్రజలు ఈ రైలు అతిపెద్ద బహుమతిగా నిలుస్తుందన్నారు. జమ్మూ కశ్మీర్ లో ఆధ్యాత్మిక పర్యాటక అభివృద్దికి వందే భారత ఎక్స్ ప్రెస్ ఓ సాధనంగా ఉపయోగపడుతుందన్నారు. రాబోయే పదేళ్లలో జమ్మూను అత్యంత అభివృద్ది చెందిన ప్రాంతంగా తీర్చిదిద్దుతామన్నారు

ఈ సంరద్భంగా రైల్వే మంత్రి పియూష్ గోయల్ మాట్లాడుతూ వైష్ణోదేవి భక్తులకు ఈ రైలు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. అక్టోబర్ 5 నుంచి ఈ రైలు కమర్షియల్ సేవలను కొనసాగిస్తామన్నారు. ఐఆర్ సీటీసీ లో దినికి సంబంధించిన టికెట్లను అందుబాటులోకి ఉంచామని తెలిపారు. 2022 ఆగస్ట్ 15 కల్లా కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రైల్వేలను అనుసంధానం చేస్తామని ఈ సందర్భంగా రైల్వే మంత్రి హామీ ఇచ్చారు.