శ్వాస తీసుకోడానికి ఇబ్బందిపడుతున్న అమిత్‌ షా ఎయిమ్స్ లో చేరారు
Timeline

శ్వాస తీసుకోడానికి ఇబ్బందిపడుతున్న అమిత్‌ షా ఎయిమ్స్ లో చేరారు

ఆగస్టు 2న అమిత్‌ షా తనకు కోవిడ్‌-19 పాజిటివ్‌ రిపోర్ట్‌ వచ్చిందని ట్వీట్‌ చేశారు. అదే రోజు ఆయన మేదాంత ఆసుపత్రిలో చేరారు. ఆగస్టు 14న మేదాంత నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. అయితే తీవ్రమైన ఒళ్లు నొప్పుల కారణంగా అమిత్ షా ఆగస్టు 18న ఎయిమ్స్‌లో చేరారు. ఆగస్టు 31 ఎయిమ్స్ నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు.

అయితే కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అస్వస్థతతో మరోసారి ఎయిమ్స్‌ ఆసుపత్రిలో చేరారు.

శ్వాస తీసుకోవడంలో అమిత్ షా ఇబ్బంది పడుతున్నారని ఆయన కుటుంబ సన్నిహితులు తెలిపారు. శనివారం రాత్రి 11 గంటల సమయంలో ఎయిమ్స్‌లో చేరారు. అమిత్ షా ఆరోగ్యంపై ఎయిమ్స్ డాక్టర్ ప్రొఫెసర్ ఆర్తి విజ్ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.

‘‘హోం శాఖ మంత్రి అమిత్ షా కోవిడ్-19 అనంతర వైద్యసేవలు పొంది, ఆగస్టు 30వ తేదీన ఎయిమ్స్ నుంచి డిశ్చార్జి అయ్యారు. డిశ్చార్జి అయ్యేప్పుడు సూచించిన విధంగా.. పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఒకటి, రెండు రోజుల పాటు కంప్లీట్ హెల్త్ చెకప్ కోసం అడ్మిట్ అయ్యారు’’ అని ఆ ప్రకటనలో పేర్కొ్నారు.

మళ్లీ నిన్న శ్వాస సంబంధమైన ఇబ్బందులు రావడంతో మరోసారి ఎయిమ్స్‌లో చేరారు.