అమృత మారుతీరావు కూతురే…

ఒక కులాంతర ప్రేమ వివాహాం ఇద్దరి మరణాలకు దారతీసింది. కూతురుపై అమృతరావుది ప్రాణం తీసే ప్రేమే కాదు..ప్రాణం ఇచ్చే ప్రేమ అని జనాలు చర్చించుకుంటున్నారు. ఈ విషయంలో మొదటి నుంచి ప్రజలు రెండు వర్గాలుగా విడిపోయారు. కొందరు అమృతకు సపోర్ట్ చేస్తుంటే, మరికొందరు మారుతీరావుకు మద్దతుగా నిలిచారు. అయితే ఇటీవలి కాలంలో అమృత గురించి ఒక వార్త తెగ వైరల్ అవుతోంది. ఆమె అసలు మారుతీరావు అస్సలు కూతురు కాదని, అందుకే తండ్రి చనిపోయిన తర్వాత ఆమెలో కొంచెం కూడా బాధ కనిపించలేదని కొందరు విమర్శిస్తున్నారు. తండ్రి ఎంత తప్పు చేసినా చనిపోయాక కూడా ఆయన్ను ‘నాన్న’ అని సంబోధించకపోవడంపై పెదవి విరుస్తున్నారు. ఆమె దత్త పుత్రిక అంటూ సోషల్ మీడియాలో ఆరోపణలు చేస్తున్నారు.

అయితే ఈ విషయంపై ఇటీవల ఓ ప్రైవేట్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్క్యూలో అమృత బాబాయ్ శ్రవణ్ క్లారిటీ ఇచ్చారు. 200 శాతం అమృత తన అన్న మారుతీరావు కూతురే అన్న శ్రవణ్, జ్యోతి ఆస్పత్రిలో..జ్యోతి డాక్టర్ డెలివరీ చేశారని చెప్పారు. మరీ అంతగా డౌబ్ట్ ఉంటే డిఎన్‌ఏ టెస్ట్ చేయించుకోవచ్చని తెలిపారు. ఇటువంటి చెత్త ఆరోపణలు చేసి, అమృత మనసు గాయపెట్టడం కరెక్ట్ కాదని సూచించారు. ఇటువంటి రూమర్స్ వల్ల కూడా మారుతీరావు, అమృత మధ్య గ్యాప్ ఏర్పడిందని తెలిపారు. తన అన్నకు, వదినకు…అమృత అంటే ప్రేమ కాదని..పిచ్చి అని చెప్పుకొచ్చారు.

Read Previous

కవిత రీఎంట్రీ కన్ఫార్మ్.. రేపు నిజామాబాద్ నుండి ఎమ్మెల్సీ గా నామినేషన్

Read Next

కరోనాపై మహేష్ బాబు: ఆలోచింపజేసేలా వీడియో పోస్ట్

Leave a Reply

Your email address will not be published.