‘వర్షా బొల్లమ్మ’ తమిళ చిత్ర పరిశ్రమలో చురుకుగా ఉన్న తమిళ నటి. ఆమెకు నటి నజ్రియా నజీమ్‌తో పోలిక ఉంది. ‘సతురాన్’ చిత్రంతో వర్షా తన నటనా రంగ ప్రవేశం చేసింది. ప్రస్తుతం ఈ కథానాయిక ఆనంద్ దేవరకొండ హీరోగా తెరకెక్కించిన చిత్రం ‘మిడిల్ క్లాస్ మెలొడీస్’ నటించింది. ఈ సినిమా ఈ నెల 20 నుంచి అమేజాన్ ప్రైమ్‌లో ప్రసారం కానుంది.
సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్న ఆమె తన గురించిన ఎన్నో విశేషాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. ‘‘నా స్వస్థలం కర్నాటకలోని కొడుగు. అయితే నా పేరు వర్ష బొలమ్మ కావడంతో తెలుగు అమ్మాయేనేమో అని కొంతమంది అనుకుంటున్నారు. కానీ నేను తెలుగమ్మాయిని కాదు. కానీ తెలుగు మాట్లాడగలను. ‘చూసీ చూడంగానే’ నా మొదటి సినిమా. ‘మిడిల్‌క్లాస్ మెలొడీస్’ నా రెండో చిత్రం. ఈ సినిమాలో నేనే నేనే డబ్బింగ్ చెప్పాను. అందరు నన్ను ‘నజ్రియా నజీమ్’ లాగే ఉన్నారంటున్నారు, కానీ నేను ఆమెను కాదని సినిమా చూశాక మీరే ఒప్పుకుంటారంటూ సమాధానం ఇచ్చింది.