#GreenChallenge: మొక్కలు నాటిన యాంకర్ శ్యామల

19

తెలంగాణలో గ్రీన్ ఛాలెంజ్ సందడి కొనసాగుతోంది. టీఆర్ఎస్ ఎంపీ సంతోష్ విసిరిన ఛాలెంజ్‌ రోజు రోజుకూ విస్తరిస్తోంది. అందులో భాగంగా .. ప్రముఖ యాంకర్ శ్యామల గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించి, ఎస్ఆర్ నగర్ లో తన నివాసంలో మొక్కలు నాటారు. అనంతరం యాంకర్లు ఝాన్సీ, రవి, వర్శిణిలను నామినేట్ చేశారు. ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన ఈ ఉద్యమం ఎంతో బాగుందని శ్యామల మెచ్చుకున్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించాలని కోరారు.