ఎన్నికల్లో అద్భుత విజయాన్ని సాధించి జనరంజకంగా ఏడాది పాలన పూర్తి చేసుకున్న సీఎం వైఎస్ జగన్ మరో ఘనతను సొంతం చేసుకున్నారు. దేశవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రుల్లో వైఎస్ జగన్ నాలుగో స్థానంతో సీనియర్ల సరసన నిలిచారు.

మరోవైపు వరుసగా రెండోసారి కేంద్రంలో అధికారం చేపట్టిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పనితీరు పట్ల దేశవ్యాప్తంగా 65.69 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం పనితీరుపై 62 శాతం సంతృప్తి వ్యక్తమైంది. ప్రధాని మోదీ పట్ల అత్యంత సంతృప్తి వ్యక్తం చేసిన రాష్ట్రాల్లో ఒడిశా (95.6 శాతం) ముందు వరుసలో ఉండగా ఆంధ్రప్రదేశ్ లో 88.6 శాతం సంతృప్తి వ్యక్తమైంది. దేశవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ కలిగిన సీఎంలలో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కు ప్రథమ స్థానం దక్కింది.

Leave a Reply

Your email address will not be published.