Breaking News :

దీక్షకు దిగిన ఆంధ్రా కాంగ్రెస్ నేతలు

విజయవాడలో ని ఆంధ్ర రత్న భవన్ లో కాంగ్రెస్ నేతలు ఒక్కసారిగా దీక్ష చేపట్టారు. కాగా రెండు నెలలకు ఒకేసారి ఇచ్చిన విద్యుత్‌ బిల్లులను మాఫీ చేయాలని డిమాండ్‌ చేస్తూ పెద్దఎత్తున కాంగ్రెస్‌ పార్టీ ఆందోళనకు దిగింది. ఆంధ్రరత్న భవన్‌లో ఈ దీక్ష లో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ కి సంబందించిన పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్‌, ఉపాధ్యక్షుడు గంగాధర్‌, నరహరశెట్టి నరసింహారావు నిరసన దీక్ష చేపట్టారు. అంతేకాకుండా కడప జిల్లా వేంపల్లెలోని తన స్వగృహంలో పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ నర్రెడ్డి తులసిరెడ్డి నిరసన దీక్ష చేశారు. ప్రస్తుత బిల్లులకు పాత టారీఫ్ లని వర్తింప చేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. ]

అంతేకాకుండా గత కొంత కాలంగా రాష్ట్రంలో పెరుగుతున్నటువంటి మహమ్మారి కరోనా వైరస్ కారణంగా, రాష్ట్రంలో విధించిన లాక్ డౌన్ నేపథ్యంలో చాలా మందికి ఉపాధి లేక, కనీసం తినడానికి కూడా దొరకక తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు. ఇలాంటి తరుణంలో ఇలా విద్యుత్ చార్జీలను పెంచుతూ ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం సమంజసం కాదని, ఇప్పటికైనా ప్రభుత్వ నేతలు కాస్త ఆలోచించాలని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.

Read Previous

కీచక డాక్టర్: కడుపు నొప్పితో వచ్చిన మహిళపై

Read Next

నెల్లూరు: ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త జైలులో, చెట్టు కింద భార్య