జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు మళ్ళీ తన పార్టీ పనుల్లో బిజీగా ఉన్నారు.అయితే గడిచిన ఎన్నికల్లో జనసేన పార్టీ దారుణమైన పరాజయాన్ని చవి చూసిన సంగతి అందరికి తెలిసిందే.దానికి ఎన్నో కారణాలు ఉన్నా..పవన్ ప్రవేశ పెట్టిన మ్యానిఫెస్టోకు మాత్రం మంచి స్పందన లభించింది.
ముఖ్యంగా జనసేన పార్టీ మ్యానిఫెస్టో చేరిన వారంతా మ్యానిఫెస్టో విషయంలో ఎక్కడా తప్పులు ఎంచకుండా మంచి మార్కులనే వేశారు. ముఖ్యంగా అయితే మహిళలకు మరియు సామాన్య ప్రజలకు మరింత చేరువయ్యేలా ఆలోచింపజేసేలా పెట్టిన అంశం రేషన్ కు బదులుగా అందుకు తగ్గ నగదును నేరుగా ఇంటి యజమానురాలు బ్యాంకు ఖాతాలోకే 3000 నుంచి 3500 వేస్తానని చెప్పారు.
ఇప్పుడు ఈ అంశం మళ్ళీ వెలుగులోకి వచ్చింది.ఎందుకంటే తాజాగా ఏపీలోని అధికార పార్టీ అయినటువంటి వైసీపీ అందించిన రేషన్ బియ్యం పట్ల చాలా వరకు వ్యతిరేఖత వచ్చింది. చాలా వరకు ముక్కిపోయిన బియ్యం,ఉండలు ఉండలుగా ఉన్న బియ్యం చాలా మందికి అందాయి. అందులోను సన్న బియ్యం అందిస్తా అని చెప్పి నాణ్యమైన బియ్యం అని మార్చి అందజేస్తామని తెలిపారు కానీ సీన్ కట్ చేస్తే అవి కూడా చాలా దారుణంగా ఉన్నాయి.
ఇప్పుడు ఇదే పాయింట్ ను చెప్తూ జనసేన శ్రేణులు ప్రజలు ఇలాంటి ఇబ్బందులు పడతారు అనే పవన్ నగదును నేరుగా తమ ఖాతాల్లోనే జమ చేసినట్టయితే ప్రజలు వారికి నచ్చిన బియ్యాన్ని కొనుక్కుంటారు.వారికి కావాల్సిన సరుకులు కొనుక్కునే వారని వారు ఏ బియ్యం తినాలో వాళ్ళే నిర్ణయించుకుంటారని పవన్ తెలియజేసారు. మొత్తానికి జనసేనాని దూరదృష్టి మాత్రం అమోఘమే అని జనసేన అభిమానులు అంటున్నారు.