Breaking News :

కరోనా హెల్త్ బులెటన్: ఆంధ్ర ప్రదేశ్ : జులై 26

గత 24 గంటల్లో 56 మంది మృతి చెందారు. 47,645 మందికి పరీక్షలు నిర్వహించగా ఏకంగా 7,627 మందికి పాజిటివ్ అని తేలింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 96,298 కు చేరింది.

మొత్తం మరణాల సంఖ్య 1,041కు చేరింది. గడిచిన 24 గంటల్లో తూర్పు గోదావరి జిల్లాలో 9 మంది, విశాఖపట్నంలో 8 మంది, కర్నూలులో ఆరుగురు, కృష్ణాలో ఐదుగురు, నెల్లూరులో ఐదుగురు, శ్రీకాకుళంలో ఐదుగురు, పశ్చిమ గోదావరిలో ఐదుగరురు, చిత్తూరులో నలుగరు, విజయనగరంలో ముగ్గురు, అనంతపురంలో ఇద్దరు, కడపలో ఇద్దరు, గుంటూరులో ఒకరు, ప్రకాశంలో ఒకరు మృత్యువాత పడ్డారు.

గడిచిన 24 గంటల్లో 3,041 మంది కరోనా నుంచి కోలుకున్నారని ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం 96,298 పాజిటివ్ కేసులకు గాను 46,301 మంది డిశ్చార్జ్ కాగా.. 48,956 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

Read Previous

IOS యాప్ లాంచ్ చేసిన సుప్రీం కోర్టు

Read Next

సోనూ సూద్ కి చంద్రబాబు ఫోన్ కాల్