బిగ్ బ్రేకింగ్: జగన్ పై ఆ లెటర్ నేను రాయలేదు, అది ఫేక్ – ఏపీ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్… కేంద్ర హోంశాఖకు లేఖ రాశారని టీడీపీ నేతలు, కార్యకర్తలు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. కొన్ని యెల్లో మీడియా బ్యాచ్ కూడా ఈ లెటర్ ని చూయిస్తు జగన్ ని టార్గెట్ చేసాయి.

ఆయన రాసారు అన్నట్టుగా ప్రచారం జరుగుతున్నా లేఖలో పేర్కొన్న అంశాలు సంచలనంగా మారాయి. స్థానిక ఎన్నికలు వాయిదా వేసిన తర్వాత ఏకంగా ముఖ్యమంత్రే తనను బెదిరించేలా మాట్లాడారని, మంత్రులందరూ వంతులవారీగా తనపై ఆరోపణలు గుప్పించారని వాపోయారు. చివరికి స్పీకర్‌ సైతం తనపై తీవ్ర స్థాయిలో మాటల దాడి చేసిన విషయాన్ని కూడా ఆయన లేఖలో పేర్కొన్నారు. తొలివిడత జరిగిన ఎన్నికల్లో కనీవినీ ఎరుగని హింస జరిగిందంటూ కడప జిల్లాలో జరిగిన ఏకగ్రీవాల గురించి చెప్పుకొచ్చిన ఆయన.. ఇక, తనకు భద్రత కల్పించాలని పేర్కొన్నారు. తనకే కాదు.. తన కుటుంబ సభ్యులకు కూడా బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయని కేంద్రం దృష్టికి తీసుకెళ్లిన రమేష్ కుమార్.. తాను హైదరాబాద్‌ నుంచే విధులు నిర్వహిస్తానని అంటూ… మిగిలిన రెండు దశల ఎన్నికలను తాను ధైర్యంగా ప్రజాస్వామ్య బద్ధంగా నిర్వహిస్తానని, అయితే తనకు, తన కుటుంబానికి భద్రత కావాలని విజ్ఞప్తి చేశారు.

అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ , కేంద్ర హోంశాఖకు ఈసీ రమేష్ కుమార్ రాసిన ఐదు పేజీల లేఖ అవాస్తవం అని తేలింది. అది అయన రాలేదని అది ఫేక్ అని TV9 మొదటగా తమ వార్తల్లో చెప్పింది. ఐన కూడా కొన్ని ఎల్లో బ్యాచ్ మీడియా tv9 చెప్పేది అబద్దం అన్నట్టుగా ప్రచారం చేసాయి. అంటే కాకుండా నేషనల్ మీడియా దృష్టిలో పడేలా చేసి అందరిని కన్ఫ్యూజ్ చేసారు. కానీ ఆ తరువాత ఫ్యాక్ట్ చెక్ చేసిన ANI మీడియా వారిని తప్పుని తెలుసుకొని ఆ వార్తను డిలీట్ చేసి రమేష్ కుమార్ మెసేజ్ ని ట్వీట్ చేసాయి.

Read Previous

బ్రేకింగ్: ఆ ఎన్నికల కమీషనర్ లెటర్ ఫేక్ స్టోరీ?

Read Next

జైలు నుండి విడుదల.. ఉత్తమ్ నే టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి