12 మంది ఐపిఎస్‌లు బ‌దిలీలు

15

రాష్ట్రంలో 12 మంది ఐపిఎస్‌లు బ‌దిలీలు అయ్యారు. ఈ మేర‌కు శుక్ర‌వారం సాయంత్రం సిఎస్ ఎల్‌వి సుబ్ర‌హ్మ‌ణ్యం ఉత్త‌ర్వులు జారీ చేశారు. గుంటూరు గ్రామీణ ఎస్పీగా సిహెచ్ విజ‌య‌రావు, విజ‌య‌వాడ డిసిపి-2గా విక్రాంత్ పాటిల్‌, చిత్తూరు ఎస్‌పిగా సెంథిల్ కుమార్‌, తిరుప‌తి అర్బ‌న్ ఎస్‌పిగా గ‌జ‌రావు భూపాల్‌ను ప్ర‌భుత్వం నియ‌మించింది. తిరుప‌తి అర్బ‌న్ ఎస్‌పి అన్బురాజ‌న్‌ను క‌డ‌ప‌కు, చిత్తూరు ఎస్‌పి వెంక‌ట అప్ప‌ల నాయుడును ఇంటెలిజెన్స్ విభాగానికి బ‌దిలీ చేసింది.