spot_imgspot_img

బ్రేకింగ్: ఏబీ వెంకటేశ్వర్ రావు సస్పెన్షన్ ఎత్తివేసిన ఏపీ హై కోర్ట్

ఏపీ ప్రభుత్వానికి ఇవాళ వరుసగా ఎదురుదెబ్బలు తగులున్నాయి. సీనియర్ ఐపిఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై హైకోర్టు సస్పెన్షన్ ఎత్తివేసింది. క్యాట్ ఆర్డర్‌ను కూడా న్యాయస్థానం పక్కనపెట్టింది. 

వెంకటేశ్వరరావు రిట్ పిటీషన్‌ను పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం కీలక ఆదేశాలిచ్చింది. అలాగే సస్పెన్షన్ కాలం నాటి జీతభత్యాలను చెల్లించాలని హైకోర్టు స్పష్టం చేసింది. 

ఈ ఏడాది ఫిబ్రవరి 8న వైసీపీ ప్రభుత్వం వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ విధించింది. ఆయన నిబంధనలు అతిక్రమించి నిర్ణయాలు తీసుకోవటంపై ప్రభుత్వం విధుల్లో నుంచి తొలగించింది. భద్రతా పరికరాలు కొనుగోలులో అతిక్రమణలు జరిగాయంటూ వైసీపీ నేతలు ఆరోపించారు.

ప్రజాప్రయోజనాల రీత్యా ఆయనపై సస్పెన్షన్ వేటు వేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో వెల్లడించింది. సస్పెన్షన్‌పై ఆయన క్యాట్‌ను ఆశ్రయించినా ఫలితం దక్కలేదు. ఆయనపై క్యాట్ పిటిషన్‌ను క్యాట్ కొట్టివేసింది. టీడీపీ ప్రభుత్వంలో వెంకటేశ్వరరావు విజయవాడ కమిషనర్‌గా, ఇంటెలిజెన్స్ ఛీప్‌గా పనిచేశారు. 

వైసిపి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఆయనకు ఏ పోస్టింగ్  ఇవ్వకుండా, జీతం కూడా ఇవ్వకుండా పక్కన ఉంచింది. 

Related Articles

Get in Touch

18,128FansLike
3,038FollowersFollow
0SubscribersSubscribe

Latest Posts