ఆంధ్ర ప్రదేశ్ ఏలూరు లో ప్రజలు అస్వస్థతకు గురి అవుతున్నారు గత కొద్దీ రోజులుగా . ఉన్నవారు ఉన్నట్లే కిందపడిపోయారు. నోట్లో నురగలు కక్కుతూ స్పృహ కోల్పోయారు. చిన్నపిల్లలతో సహా సమారు వంద మంది వరకు అస్వస్థతకు గురయ్యారు. చూస్తుండగానే కళ్లు తిరిగిపడిపోతుండడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.
ప్రస్తుతం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో 40 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. శనివారం రాత్రి 20 మంది డిశ్చార్జ్ అయినట్లు అధికారులు తెలిపారు. బాధితులకు రక్త పరీక్షలు, సిటీ స్కానింగ్ పరీక్షలు చేస్తున్నారు. వ్యాధి లక్షణాలు కనిపించడంలేదు. మంచినీరు, వాయు కాలుష్యం కారణం కావచ్చునని వైద్యుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మంచినీరు కాచి తాగాలని, అవసరమైతే బయటకు రావాలంటూ వైద్యుల సూచిస్తున్నారు.
ఈ సంఘటనపై స్పందించిన తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పై విమర్శలు గుప్పించారు . ట్విట్టర్ వేదికగా జగన్ ని టార్గెట్ చేస్తూ ఈ కామెంట్లు చేశారు లోకేష్. ” వింత రోగం వచ్చింది,ప్రజలకు కాదు @ysjagan కి. తన చేతగాని తనం ఎక్కడ బయటపడుతుందో అనే భయంతో ఏలూరు లో వింత రోగం వచ్చింది, మాస్ హిస్టీరియా అనే ప్రచారానికి తెరలేపింది ప్రభుత్వం.నీటిలో లోపం లేదు,గాలిలో లోపం లేదు,మాకు ఓటేసిన ప్రజల్లోనే లోపం ఉందని వైద్య శాఖ మంత్రి అనడం, పారిశుద్ధ్య లోపాన్ని ప్రజల పైకి నెట్టేసే ప్రయత్నం చేయడం దారుణంపూర్తి స్థాయిలో ల్యాబ్ రిపోర్ట్స్ రాకుండానే నీరు కలుషితం కాలేదు అని ప్రకటనలు ఇవ్వడం మాని మరింత మంది అస్వస్థతకు గురికాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ” అంటూ ట్వీట్ చేసారు లోకేష్.