ఎయిడ్స్ బాధితుల్లో రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్
Timeline

ఎయిడ్స్ బాధితుల్లో రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్

తాజాగా అందిన అధికారిక లెక్కల ప్రకారం ఆంధ్ర ప్రదేశ్ ఎయిడ్స్ లో రెండో స్థానంలో ఉందట. ఏపీ, తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఎయిడ్స్ బాధితులు ఎంతమంది ఉన్నారో రాష్ట్రం విభజన తర్వాత ఆంధ్రాలో అంతే మంది ఉన్నారు.

2009 సర్వ్ ప్రకారం ఉమ్మడి రాష్ట్రంలో మొత్తం 4 లక్షల 89వేల మంది హెచ్ఐవీ ఎయిడ్స్ బాధితులు ఉంటె ఇప్పుడు కేవలం ఒక్క ఆంధ్రాలోనే అధికారక లెక్కల ప్రకారం 3.98 లక్షల మంది వ్యాధి సోకిన బాధితులు ఉంటె అనధికారికంగా ఇంకో లక్ష మంది ఎయిడ్స్ బాధితులు ఉన్నారు. అంటే 2009లో రెండు రాష్ట్రాలకు కలిపి 5 లక్షల మంది ఎయిడ్స్ బాధితులు ఉంటె ఇప్పుడు కేవలం ఒక్క ఆంధ్రాలోనే దాదాపు 5లక్షల మంది ఉన్నారు.

జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ (ఎన్ఏసీఓ) 2017లో విడుదల చేసిన రిపోర్టులోనూ హెచ్ ఐవీ బాధితుల్లో ఏపీ రెండవ స్థానంలో ఉంది. మహారాష్ట్ర అత్యధికంగా హెచ్ ఐవీ బాధితులతో మొదటి స్థానంలో ఉంది. ఎన్ఏసీఓ నివేదిక ప్రకారం 2017 ఏపీలో మర్చిలో 2లక్షల 70 వేల మంది ఎయిడ్స్ బాధితులు ఉంటె 2019 ఆగష్టు కి 3.98 లక్షలకు పెరిగింది.

ఇక జిల్లాల వారీగా చూసుకుంటే తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కువ మంది ఎయిడ్స్ బాధితులు ఉన్నారు. రెండొవస్థానంలో గుంటూరు, మూడోవ స్థానంలో కృష్ణ, నాలుగో స్థానంలో పశ్చిమ గోదావరి జిల్లాలు ఉన్నాయి. ఆ తర్వాత స్థానాల్లో విశాఖపట్నం, ప్రకాశం, అనంతపురం, చిత్తూరు, కర్నూలు, నెల్లూరు, కడప, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు ఉన్నాయి.

అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఎయిడ్స్ బాధితుల్లో పురుషుల కంటే మహిళల ఎక్కువ ఎయిడ్స్ బాధితులు ఉన్నారట. అయితే ఈ వ్యాధిని కంట్రోల్ చెయ్యాలని, 2030 నాటికీ ఈ వ్యాధిని పూర్తిగా అంతం చెయ్యాలని ప్రభుత్వం నిర్ణయించుకుందట.

అందుకే ఎయిడ్స్ వ్యాధిని నివారించేందుకు జాతీయ ఎయిడ్స్ కంట్రోల్ సంస్థ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సంస్థల ఆధ్వర్యంలో ఎయిడ్స్ బాధితులకు ప్రభుత్వం ఉచితంగా మందులు అందిస్తోంది. ఎయిడ్స్ నియంత్రణ సంస్థ నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ప్రోగ్రామ్ కూడా ప్రారంభించింది.

Leave a Reply

Your email address will not be published.