Breaking News :

గ్రేట్..ఏపీ దిశ పోలీస్ స్టేషన్లకు అరుదైన గౌరవం

andhra pradesh disha police stations

ఏపీలో సీఎం జగన్ ప్రారంభించిన దిశ పోలీస్ స్టేషన్లకు ISO సర్టిఫికేట్లు లభించాయి. అత్యుత్తమ నాణ్యత, ప్రమాణాలతో కూడిన సేవలకు గాను 6 దిశ పోలీస్‌స్టేషన్లకు లభించిన జీటౌ 9001:2015 సర్టిఫికెట్లను సీఎం జగన్ ఆవిష్కరించారు. సౌత్‌ ఇండియా ఐఎస్‌ఓ జనరల్‌ మేనేజర్ డాక్టర్‌ ఎలియాజర్ సర్టిఫికెట్లు జారీని వివరించారు.

అయితే రాజమండ్రి అర్బన్, విశాఖపట్నం సిటీ, నెల్లూరు, కర్నూలు, విజయనగరం, అనంతపూర్‌ పోలీస్‌స్టేషన్లకు ఈ జీటౌ 9001:2015 సర్టిఫికెట్లు లభించాయి. త్వరలో విజయవాడ సిటీ దిశ పోలీస్‌స్టేషన్‌కు కూడా ఈ సర్టిఫికెట్‌ రానున్నట్టు సమాచారం. అయితే మొత్తం 18 దిశ పోలీస్టేషన్ల సిబ్బందితో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి వారిని అభినందించారు.

Read Previous

అలర్ట్: కెసిఆర్ హై లెవెల్ మీటింగ్ ఈరోజే

Read Next

ఆపరేషన్ చిరుత: ఎక్కడున్నావమ్మా?