చెల్లిని రేప్ చేయాలని చూసిన వాడి చెయ్యిపై కొడవలి వేటు వేసిన అక్క

తన చెల్లెలిపై అత్యాచారం చేయాలనీ చూసిన వారి నుండి రక్షించడానికి ఒక టీనేజ్ అమ్మాయి కొడవలితో దాడి చేసింది. ఆంధ్రప్రదేశ్, చిత్తూరు జిల్లాలోని రామసుందరం బ్లాక్‌లోని తిరుమలారెడ్డి పల్లె గ్రామంలో ఈ సంఘటన జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, 15 ఏళ్ల బాలిక శనివారం మధ్యాహ్నం పశువులను మేపడానికి పొలానికి వెళ్లింది. గ్రామంలో కూలీ పని చేసుకునే శంకరప్ప ఆమెను వెనకాలే వెళ్లి తనని పట్టుకున్నాడు. అమ్మాయి వాడి నుండి తప్పించుకోడానికి బలంగా ప్రయత్నించినా వాడు ఆ అమ్మాయి చేతులను గట్టిగా పట్టుకున్నాడు.

అక్కడే ఉన్న అమ్మాయి అక్క తన చెల్లెలిని వదిలేయాలని శంకరప్పను కోరింది. కానీ అది వినిపించుకోకుండా వాడు ఇంకా రెచ్చిపోయాడు. దీనితో చెల్లెలిని కాపాడుకోవడం కోసం అక్క పక్కనే పొలం పనుల కోసం తెచ్చిన కొదవలేని తీసుకొని వాడి చెయ్యి మీద వేటు వేసింది . అంతే భయంతో పరుగులు పెట్టేసాడు శంకరప్ప .

ఆ ఆతరువాత అక్క చెల్లెల్లు ఇద్దరు ఇంటికి వెళ్లి , తమ తల్లి తండ్రులతో కలిసి పోలీస్ స్టేషన్ కి వెళ్లి జరిగింది చెప్పారు. దీనితో పోలీసులు శంకరప్పను పట్టుకొని ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్ లో జాయిన్ చేసాయి వాడి పై పలు కేసులు నమోదు చేసారు.