టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. శుక్రవారం ఈ సినిమా టీజర్‌ను చిత్రబృందం సోషల్‌మీడియా వేదికగా విడుదల చేసింది. టీజర్లో మహేశ్ చెప్పిన డైలాగులు ప్రేక్షకులతో విజిల్స్ వేపిస్తున్నాయి. దీంతో టీజర్ చాలా అద్భుతంగా ఉందని అటు సినీ ప్రముఖులు, ఇటు ప్రేక్షకులు సోషల్‌మీడియా వేదికగా చిత్రబృందాన్ని ప్రశంసిస్తున్నారు.