ఉత్తర్ ప్రదేశ్ లోని హత్రాస్ గ్రామానికి చెందిన 19 ఏళ్ళ మనీషా వాల్మీకి గ్యాంగ్ రేప్ కి గురై నిన్న మంగళ వరం మృతి చెందిన విషయం దేశాన్ని ఒక్కసారిగా ప్రతీ ఒక్కరిని కదిలించేసింది. ఈ సంఘటన లో కుటుంబ నిర్ణయానికి వ్యతిరేకంగా పోలీసులు మనీషా మృతదేహాన్నీ అర్ధరాత్రి బలవంతంగా దహనం చేయడం ఇపుడు దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది.

ఈ సంఘటన జరిగి 24 గంటలు కూడా గడవక ముందే హత్రాస్ గ్రామానికి దగ్గర్లోనే ఉన్న బలరాంపూర్ లో మరో దళిత బాలికను గ్యాంగ్ రేప్ చేసారు ఆగంతకులు. ఆ అమ్మాయిని రేప్ చేసిన తరువాత అమ్మాయి కాళ్ళు , నడుము ను నుజ్జు నుజ్జు చేసారు దుర్మార్గులు. అంతే కాకుండా విషం కలిపినా ఇంజెక్షన్ ఇచ్చారు ఆ అమ్మాయికి.

ఈ కేసులో ఇద్దరినీ అరెస్ట్ చేసినట్టుగా అక్కడి పోలీసులు చెపుతున్నారు.

పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం , అమ్మాయి తల్లి తండ్రులు ఇచ్చిన సమాచారం ప్రకారం , ఆ అమ్మాయి దగ్గర్లో ఉన్న పొలాల్లో పనికి వెళ్లిందని, ఒక రిక్షా అతను ఆ అమ్మాయిని ఇంటి దగ్గర దింపాడు అని , వచ్చే సరికి అమ్మాయి చేతికి ఇంజెక్షన్ ఉందని , వెంటనే అమ్మాయిని ఆసుపత్రికి తీసుకెళ్తుండగానే దారి మధ్యలోనే ఆ అమ్మాయి చనిపోయింది.

హత్రాస్ గ్యాంగ్ రేప్ కన్నా ఇది దారుణంగా ఉందని మీడియా వర్గాలు చెప్తున్నాయి .