జగన్ 3 రాజధానుల నిర్ణయానికి గవర్నర్ ఆమోదం, ఆనందంలో ఆంధ్ర ప్రజలు
Timeline

జగన్ 3 రాజధానుల నిర్ణయానికి గవర్నర్ ఆమోదం, ఆనందంలో ఆంధ్ర ప్రజలు

ఆంధ్రప్రదేశ్‌లో శుక్రవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఆర్డీఏ చట్టం- 2014 రద్దు, పరిపాలనా వికేంద్రీకరణ బిల్లులకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచంద్ ఆమోదం తెలిపారు. దీంతో ఇకపై శాసన (లెజిస్లేచర్) రాజధానిగా అమరావతి, పరిపాలనా (ఎగ్జిక్యూటివ్) రాజధానిగా విశాఖపట్నం, న్యాయ (జ్యుడీషియల్) రాజధానిగా కర్నూలు అధికారికంగా కొనసాగేందుకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ రాజముద్ర వేశారు.

మరోవైపు రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులపై హైకోర్టులో పలువరు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై హైకోర్టులో విచారణ జరగుతోంది. ఈ తరుణంలో ఈ బిల్లులపై సుదీర్ఘంగా న్యాయ నిపుణుల సూచనలు, సలహాలు తీసుకున్న గవర్నర్ బిశ్వభూషణ్ హరిందన్ శుక్రవారం (జూలై 31) ఈ బిల్లులకు ఆమోద ముద్ర వేశారు. దీంతో శాసన ప్రక్రియ పూర్తయిందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

జగన్ తీసుకున్న ఈ నిర్ణయంపై ఇప్పటికే దేశంలో పలు నేతలు గొప్పగా చెప్పుకొచ్చారు. ఆంధ్ర ప్రదేశ్ లో కూడా ప్రజలందరూ ఈ నిర్ణయానికే ఓటు వేశారు. యెల్లో మీడియా లో చెపుతున్నట్టు కాకుండా జగన్ ఎన్నికల ముందే చాల సార్లు ఈ విషయం పై చర్చించారు. అసెంబ్లీ లో అధికారంలో లేనందుకే రాష్ట్ర అప్పటి పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నిర్ణయాన్ని రాజకీయం చేయకుండా సమర్దించాము అని, ఒకవేళ ఈ ఐదేళ్ళలో కాస్త అయినా అభివృద్ధి జరిగి ఉంటె ఈ నిర్ణయం తీసుకునేవారు కాదని, అభివృద్ధి లేకపోగా అవినీతి ఎక్కువ జరిగిందనేది రాష్ట్ర ప్రజలందరూ గ్రహించడం వల్లే చిత్తు చిత్తుగా బాబు ఓడిపోయారు అనేది వాస్తవం.

ఇది గ్రహించిన బీజేపీ జగన్ తీసుకున్న ఈ నిర్ణయానికి కౌంటర్ వేయకుండా కాస్త సహకరించారు. దీని వాళ్ళ బీజేపీ కి కూడా రాజకీయ లబ్ది చేకూరుతుందనేది వాళ్ళ అంచనా. ఇక బీజేపీ తో చేయి కలిపినా పవన్ కళ్యాణ్ ఎన్నికల ముందు ఇపుడు జగన్ తీసుకున్న నిర్ణయాన్నే పలు సార్లు వ్యక్తపరిచారు కానీ ఎన్నికల్లో ఓటమి తరువాత మళ్ళీ టీడీపీ బాటే పట్టారు. ఇప్పటికి చేతులు కలిపింది బీజేపీ అయినా బాట మాత్రం టీడీపీతోనే అనేది రాజకీయ విశ్లేషకులు చెప్తున్న మాట.

Leave a Reply

Your email address will not be published.