మామూళ్లు వసూలు.. గ్రామ వాలంటీర్ల తొలగింపు

19

మచిలీపట్నం మండలం రుద్రవరం పంచాయతీలో నలుగురు గ్రామ వాలంటీర్లను తొలగించారు. అభియోగాలు రుజువు కావడంతో ఎండీవో తొలగింపు ఉత్తర్వులు జారీచేశారు. లబ్ధిదారులకు పింఛన్ ఇచ్చాక దసరా మామూలు పేరిట వాలంటీర్లు వసూళ్లకు పాల్పడడంతో వారిని తొలగించారు.