ఏపీ హైకోర్టు: డిజాస్టర్ మేనేజ్మెంట్ కి వెళ్ళండి, అంటే చంద్రబాబు కేసు కూడా?

కరోనా లాక్ డౌన్ సమయంలో ఆంధ్ర ప్రదేశ్ లో ప్రజాపరితినిధులే రూల్స్ బ్రేక్ చేసారని ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు లో పిటీషన్లు దాఖలయ్యాయి. అయితే ఆంక్షలను, నిబందనలను ఉల్లంఘించే వారు ఎవరైనా కేసులు నమోదు చేయాలని ఆదేశించింది హైకోర్టు.

వైసీపీకి చెందిన ఓ మంత్రితో పాటు ఏడుగురు ఎమ్మెల్యేలు లాక్ డౌన్ సమయంలో ఉల్లంఘనలకు పాల్పడ్డారంటూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరైతే లాక్ డౌన్ ఉల్లంఘనలకు పాల్పడ్డారో వారి మీద డిజాస్టర్ మేనేజ్ మెంట్ కి ఫిర్యాదు చేయాలని పిటీషనర్లకు హైకోర్టు సూచించింది.

డిజాస్టర్ మేనేజ్ మెంట్ కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ అమలు చేస్తున్నాయంటూ అందుకే అక్కడే కేసులు ఫైల్ చేయండని తెలిపింది. ప్రజలకు, నేతలకు అందరికి సీరియస్ నెస్ ఉండాలని సూచించింది.

అయితే లాక్ డౌన్ రూల్స్ బ్రేక్ చేసారని చంద్రబాబు పై కూడా హైకోర్టు లో పిటీషన్ దాఖలు అయిన విషయం తెలిసిందే. అంటే చంద్రబాబు పై కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్ వారికీ కంప్లైంట్ వెళ్లనుంది అన్నమాట.