ఏపీ హైకోర్టు: ఫేక్ న్యూస్ పై జగన్ ప్రభుత్వ జీవోకి మద్దతు
Timeline

ఏపీ హైకోర్టు: ఫేక్ న్యూస్ పై జగన్ ప్రభుత్వ జీవోకి మద్దతు

నకిలీ వార్తలపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులకు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్‌ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టివేసింది.

అటువంటి ఉత్తర్వులు జారీ చేయడానికి ఉద్దేశ్యం ఏమిటంటే, బాధ్యతగా, నమ్మకమైన వార్తా అంశాలను ప్రచురించాలని చీఫ్ జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి, జస్టిస్ నినాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం పేర్కొంది.

“కొన్ని ముద్రణ, ఎలక్ట్రానిక్ మరియు సోషల్ మీడియా ఉద్దేశపూర్వకంగా తప్పుడు, నిరాధారమైన మరియు పరువు నష్టం కలిగించే వార్తలను స్వలాభాలకోసం ఆసక్తితో వ్యాప్తి చేయడం ద్వారా ప్రభుత్వ మరియు ప్రభుత్వ అధికారుల ఇమేజ్‌ను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నాయని ప్రభుత్వం దృష్టికి వచ్చాయని తెలిపింది.

ప్రభుత్వం పై కానీ అధికారులపై కానీ సరైన సమాచారం ప్రజలకు అందుతుందా లేదా ఫేక్ న్యూస్ చేరుతుందా అని తెలుసుకోవడానికి , ఫేక్ న్యూస్ ప్రచురించి, ప్రచారం చేసే వారిపై తగిన సెక్షన్ల కింద కేసులు పెట్టడానికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం జీఓని విడుదల చేసింది.

దీనిని సమర్థిస్తూ , ఇందులో తప్పేమి లేదని ఆంధ్ర హైకోర్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వేసిన పిటీషన్ ని కొట్టివేసింది.

Leave a Reply

Your email address will not be published.